China: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అక్టోబర్7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి చొరబడి ప్రజలు ఊచకోత కోశారు. ఈ దారుణ ఘటనలో 1300 మంది ఇజ్రాయిలు చంపబడ్డారు. దీంతో పాటు 150 మందిని హమాస్ మిలిటెంట్లు బందీగా గాజాకు తీసుకెళ్లారు. ఈ దాడి వల్ల ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై భీకరదాడులు చేస్తోంది. వైమానిక దళం గాజా నగరంతో పాటు ఉత్తర ప్రాంతాన్నిటార్గెట్
China: హమాస్‌పై ఇజ్రాయిల్ యుద్ధం ప్రకటించడంతో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయిల్ వ్యక్తుల్ని, యూదుల్ని టార్గెట్ చేస్తున్నారు. హమాస్ శనివారం ఇజ్రాయిల్‌పై భీకర దాడి జరిపింది. పిల్లల్ని, మహిళల్ని, వృద్ధులని చూడకుండా దారుణంగా మారణకాండ కొనసాగించారు. చిన్న పిల్లల తలలు నరికి హత్య చేశారు.
China: అగ్రరాజ్యం కావాలని కలలు కంటున్న చైనా అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే గతంలో ఎప్పుడూ లేనంతగా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న చైనా, అమెరికాతో కయ్యం పెట్టుకుంది. ఇవిలా ఉంటే అన్నింటి కన్నా ముఖ్యంగా ఆ దేశాన్ని మరో సమస్య పట్టిపీడిస్తోంది. అక్కడి ప్రజలు పెళ్లిళ్లు చేసుకునేందుకు, పిల్లల్ని కనేందుకు ససేమిరా అంటున్నారు. సింగిల్ గా ఉండటమే బెస్ట్ అని అలాగే కంటిన్యూ అవుతున్నారు. దీంతో కమ్యూనిస్ట్ ప్రభుత్వం తలలు పట్టుకుంటోంది.
S JaiShankar: హిందూ మహాసముద్రం ప్రాంతంలోని అభివృద్ధి సవాళ్లను ఎదుర్కోవాలని బుధవారం ఇండియా పిలుపునిచ్చింది. శ్రీలంక రాజధాని కొలంబోలో జరుగుతున్న ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్(IORA) సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. యూఎన్ కన్వెన్షన్ ఆధారంగా హిందూ మహాసముద్రం స్వేచ్ఛా, బహిరంగ, సమ్మిళిత ప్రదేశంగా ఉండాలని అన్నారు.
India Growth: ఈ ఏడాది భారత జీడీపీ వృద్ధి రేటులకు ఢోకా లేదని, భారతదేశం ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంటుందని పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. 2023లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 6.3 శాతంగా ఉంటుందని తెలిపింది. గతంలోని అంచనాలను సవరించింది. ఏప్రిల్ నెలలో ఊహించినదాని కన్నా బలమైన వినియోగాన్ని భారత మార్కెట్ లో
Asian Games 2023 Closing Ceremony: 16 రోజులుగా క్రీడాభిమానులను అలరించిన ఆసియా క్రీడలు 2023 ఆదివారంతో ముగిశాయి. సెప్టెంబర్ 23న చైనాలోని హాంగ్జౌ నగరంలో అట్టహాసంగా ప్రారంభమైన 19వ ఆసియా క్రీడలు.. అక్టోబర్ 8న ఘనంగా ముగిశాయి. 80 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యం కలిగిన బిగ్ లోటస్ స్టేడియంలో 75 నిమిషాల పాటు ముగింపు వేడుకలు జరిగాయి. 45 దేశాలకు చెందిన క్రీడాకారులు మైదానంలోకి రాగా.. చైనా సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.…
Canada-India row: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య చిచ్చుపెట్టింది. ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు గతంలో ఎప్పుడూ లేని విధంగా దిగజారాయి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలతో మొదలైన ఈ వివాదం చాలా దూరం వెళ్లింది. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో ఆరోపించడం,
China: ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అందరి కన్నా ఎక్కువగా సంతోషించింది పాకిస్తాన్. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. భస్మాసుర హస్తంలా పాకిస్తాన్ దేశాన్ని నాశనం చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య ఇటీవల కాలంలో సరిహద్దు తగాదాలు తీవ్రమయ్యాయి. దీంతో పాటు పాకిస్తాన్ తాలిబాన్లకు ఆఫ్ఘనిస్తాన్ సేఫ్ జోన్ గా ఉంది. దీంతో బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో తరుచుగా ఉగ్రవాద ఘటనలు జరుగుతున్నాయి.