China: చైనాలో ఇజ్రాయిల్ ఎంబసీ ఉద్యోగిపై దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: హమాస్‌పై ఇజ్రాయిల్ యుద్ధం ప్రకటించడంతో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయిల్ వ్యక్తుల్ని, యూదుల్ని టార్గెట్ చేస్తున్నారు. హమాస్ శనివారం ఇజ్రాయిల్‌పై భీకర దాడి జరిపింది. పిల్లల్ని, మహిళల్ని, వృద్ధులని చూడకుండా దారుణంగా మారణకాండ కొనసాగించారు. చిన్న పిల్లల తలలు నరికి హత్య చేశారు. ఈ దాడి తర్వాత ఇజ్రాయిల్ ప్రతీకారాన్ని ప్రస్తుతం హమాస్ చవిచూస్తోంది. గాజా స్ట్రిప్ లోని ఇజ్రాయిల్ దాడులను ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు హమాస్ దాడిలో ఇజ్రాయిల్ వైపు 1200 మందికి పైగా చనిపోగా, గాజాలో ఇజ్రాయిల్ దాడుల వల్ల 1500 మంది వరకు మరణించారు.
Read Also: Israel-Hamas War: ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో 13 మంది బందీలు మృతి
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
ఇదిలా ఉంటే హమాస్ పై ఇజ్రాయిల్ యుద్ధం ప్రకటించిన తర్వాత ఈజిప్టులో ఇద్దరు ఇజ్రాయిలీలపై ఓ వ్యక్తి కాల్పులు జరిపి చంపాడు. తాజాగా చైనా రాజధాని బీజింగ్ లోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయంలో ఉద్యోగిపై శుక్రవారం దాడి జరిగినట్లు ఇజ్రాయిల్ విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే ఈ దాడి రాయబార కార్యాలయం లోపల జరగలేదని స్పష్టం చేసింది. దాడికి గురైన వ్యక్తి చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి నిలకడగా ఉందని ఓ ప్రకటనలో పేర్కొంది. దాడికి గల కారణాలను పరిశీలిస్తున్నామని తెలిపింది. అయితే హమాస్ పై ఇజ్రాయిల్ దాడులు జరపడమే కారణం కావచ్చని అనుమానిస్తున్నారు.
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ఏడో రోజుకు చేరుకుంది. మరోవైపు ఇజ్రాయిల్ దాడుల వల్ల గాజా ప్రాంతంలో భవనాలు నేలమట్టం అవుతున్నాయి. హమాస్ ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానం వచ్చినా కూడా ఆ చోటుపై బాంబుల వర్షం కురిపిస్తోంది ఇజ్రాయిల్ వైమానికదళం. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇజ్రాయిలీలకు ఇజ్రాయిల్ విదేశీ మంత్రిత్వశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ‘ఇజ్రాయిలీలు, యూదులపై దాడి’ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన మద్దతుదారులకు హమాస్ తీవ్రవాదులు ‘ఆవేశదినం’ నిర్వహించాలని పిలుపునిచ్చింది.
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!