దక్షిణ కొరియా వేదికగా ట్రంప్-జిన్‌పింగ్ సమావేశం అయ్యారు. ఆరేళ్ల తర్వాత ఇద్దరు నాయకులు కలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. బుసాన్‌లో జరుగుతున్న ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
దక్షిణ కొరియా వేదికగా గురువారం కీలక సమావేశం జరగనుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్-చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశం కానున్నారు. ఈ సమావేశం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం దక్షిణ కొరియాలోని బుసాన్‌లో
Saudi-Pakistan: భారత్, ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో చావు దెబ్బలు, ఆర్థిక సంక్షోభం, అంతర్గత సమస్యలతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. ఈ సమస్యల నుంచి బయటపడాలని దాయాది భావిస్తోంది. ఈ నేపథ్యంలో తన సైన్యాన్ని ఆధునీకీకరించుకోవాలని భావించడంతో పాటు పెట్టుబడుల వేటను కొనసాగిస్తోంది. ఇలాంటి సమయంలోనే సౌదీ అరేబియా రూపంలో ఓ ఆశ పాకిస్తాన్‌కు చిగురించింది. డబ్బు కోసం ఎలాంటి పనులు చేయడానికైనా ఇప్పుడు ఆ దేశం సిద్ధంగా ఉంది. ఇటీవల, సౌదీ అరేబియాతో పాకిస్తాన్ రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏ…
S-400: పాకిస్తాన్, చైనా దేశాలకు చేదు వార్త. భారత్ రక్షణ దళాలు రష్యాకు బయలుదేరాయి. ఎందుకంటే, ప్రపంచంలోనే అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌లో ఒకటైన S-400 వైమానిక రక్షణ వ్యవస్థలపై అధునాతన శిక్షణ తీసుకోవడానికి మన సైనికులు పెద్ద సంఖ్యలో రష్యాకు వెళ్లారు.
త్వరలోనే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీకానున్నారు. దక్షిణ కొరియా వేదికగా ఈ సమావేశం జరగనుంది. ఇప్పటికే చైనాపై 55 శాతం సుంకం విధించిన ట్రంప్.. తాజాగా మరో బాంబ్ పేల్చారు.
విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో విమానాలు ప్రమాదభారిన పడుతున్నాయి. తాజాగా చైనాలో విమాన ప్రమాదం ప్రయాణికులను వణికించింది. విమానం గాల్లో ఉండగానే మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. హ్యాన్జూ నుంచి సియోల్ వెళ్తుండగా ఎయిర్ చైనా విమానం (CA139)లో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్యాసింజర్ క్యాబిన్ బ్యాగులో ఉన్న లిథియం బ్యాటరీ పేలి మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.…
Rare-earth minerals: అమెరికా, చైనాల మధ్య రేర్-ఎర్త్ ఖనిజాల కోసం పెద్ద ట్రేడ్ వార్ జరుగుతోంది. చైనా తాజాగా రేర్ ఎర్త్ మెటీరియల్ ఎగుమతులపై నియంత్రణను కఠినతరం చేసింది. ఇది అమెరికాకు కోపం తెప్పించింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్, ఏకంగా చైనా ఉత్పత్తులపై 100 శాతం సుంకాలను విధించాడు. చైనా తన అరుదైన ఖనిజాలను ఎగుమతిని నియంత్రించడంతో పాటు, ప్రాసెసింగ్ టెక్నాలజీని పరిమితం చేసింది. రక్షణ, సెమీ కండర్టర్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది.
గత నెలలో చైనా భారీ కవాతు నిర్వహించింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయానికి 80 ఏళ్ల పూర్తయిన సందర్భంగా బీజింగ్‌లో భారీ కవాతు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా 25 దేశాధినేతలంతా హాజరయ్యారు.
బాబోయ్ చైనాలో కనీవినీ ఎరుగని రీతిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మైళ్ల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. 36 లైన్లు కలిగిన చైనాలోని వుజువాంగ్ టోల్ స్టేషన్ దగ్గర కార్లు క్యూ కట్టాయి. వేలాది వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి.
Russia: పాకిస్తాన్ తయారీ ఫైటర్ జెట్ JF-17 కోసం రష్యా ఇంజన్లు ఇస్తోందనే ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. మోడీ దౌత్య విధానం విఫలమైందని ఆరోపించింది. అయితే, ఈ ఊహాగానాలను రష్యా ఖండించింది. నిజానికి, JF-17 యుద్ధ విమానం కోసం పాకిస్తాన్‌కు RD-93 ఇంజిన్లను సరఫరా చేయడం వల్ల వాస్తవానికి భారతదేశానికి ప్రయోజనం చేకూరుతుందని రష్యన్ రక్షణ నిపుణులు చెబుతున్నారు.