Typhoon Ragasa: తైవాన్, చైనాలో పెను విధ్వంసం సృష్టించిన తుఫాన్.. వీడియోలు వైరల్
- తైవాన్, చైనాలో పెను విధ్వంసం సృష్టించిన తుఫాన్
- 195-200 కి.మీ వేగంతో తీవ్ర గాలులు
- తైవాన్‌లో 14 మంది చనిపోగా.. 124 మంది గల్లంతు
- వీడియోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాగస తుఫాన్ తైవాన్, చైనాలో పెను విధ్వంసం సృష్టించింది. మునుపెన్నడూ లేని విధంగా తైవాన్‌లో జలప్రళయం విరుచుకుపడింది. 195-200 కి.మీ వేగంతో తీవ్ర గాలులు, కుండపోతగా కురిసిన వర్షంతో తైవాన్ అతలాకుతలం అయింది. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద స్థాయిలో తుఫాన్ సంభవించడం ఇదే తొలిసారి కావడం విశేషం. తైవాన్‌లోని హువాలియన్‌లో బారియర్ సరస్సు ఉప్పొంగడంతో 14 మంది చనిపోగా.. 124 మంది గల్లంతయ్యారు. ఇక నీళ్లు కార్యాలయాల్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ఇది కూడా చదవండి:Trump-Shehbaz Sharif: యూఎన్‌లో ట్రంప్‌తో పాక్ ప్రధాని సంభాషణ.. రేపు వైట్‌హౌస్‌లో ప్రత్యేక భేటీ
Also Read
- Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
- BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..
- Putin: G7పై సెటైర్లు, BRICSపై ప్రశంసలు.. వెస్ట్రన్ దేశాలకు పుతిన్ కౌంటర్..
- Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
ప్రస్తుతం తుఫాను చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్, హాంకాంగ్ వైపు దూసుకుపోతోంది. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తీవ్రమైన గాలులు కారణంగా తైవాన్, హాంకాంగ్ ప్రజలు బుధవారం ఉదయం హడలెత్తిపోయారు. భీకరమైన ఈదురుగాలుల కారణంగా ప్రాణభయంతో బిల్డింగ్‌ల పైకి పరుగులు పెట్టారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. 2009లో దక్షిణ తైవాన్‌లో వచ్చిన తుఫాన్ కారణంగా 700 మంది చనిపోయారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలో తుఫాన్ వచ్చింది.
ఇది కూడా చదవండి: Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు చేదు అనుభవం.. ట్రంప్ కాన్వాయ్ కారణంగా రోడ్డుపై నిలిపివేత
బుధవారం మధ్యాహ్నం-సాయంత్రం మధ్యలో గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని తైషాన్, ఝాంజియాంగ్ మధ్య రాగస తుఫాన్ తీరాన్ని తాకుతుందని చైనా జాతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ తుఫాను గ్వాంగ్‌డాంగ్, పొరుగున ఉన్న ఫుజియాన్ ప్రావిన్స్ అంతటా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హాంకాంగ్ అబ్జర్వేటరీ ప్రకారం.. రాగస తుఫాను గంటకు 195 కి.మీ (120 మైళ్ళు) వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపింది. తుఫాన్ గంటకు 22 కి.మీ (సుమారు 14 మైళ్ళు) వేగంతో పశ్చిమం లేదా పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉందని అంచనా వేసింది.
At least 14 people were killed when a decades-old lake barrier burst in Taiwan, a government official said Wednesday, after Super Typhoon Ragasa pounded the island with torrential rainshttps://t.co/GDxlN5aUGD
🎥 CCTV footage of flooded bridge in Taiwan's Hualien after lake… pic.twitter.com/VtVwwpmlV2
— AFP News Agency (@AFP) September 24, 2025
NOW: Based on the videos I received, I can confirm this is a disaster near Guangfu Township, Hualien County, Taiwan.
Typhoon #Ragasa is passing near Taiwan. pic.twitter.com/rzI4fpU3CV
— Weather Monitor (@WeatherMonitors) September 23, 2025
Super Typhoon Ragasa, the world’s most powerful tropical cyclone this year, lashed Hong Kong with hurricane-force winds and torrential rain today, while heavy downpours in Taiwan resulted in the deaths of 14 people.
A barrier lake in Taiwan’s eastern Hualien county overflowed… pic.twitter.com/NPYgeVaPDX
— Malay Mail (@malaymail) September 24, 2025
Heavy rain from Super Typhoon Ragasa burst a lake on the east coast of Taiwan, with the deluge breaking a bridge and causing flooding in surrounding villages pic.twitter.com/uOpJFPETi8
— Reuters (@Reuters) September 23, 2025
తాజావార్తలు
-
Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
-
Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?