ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దేశాలైన అమెరికా, చైనాల మధ్య చాలా కాలంగా ఉద్రిక్తత నెలకొంది. ఇరు దేశాలు పరస్పరం కంపెనీలపై అనేక ఆంక్షలు విధించుకున్నాయి. దాదాపు మూడు దశాబ్దాలుగా చైనా ప్రపంచ కర్మాగారంగా ఉంది.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాలో ప్రస్తుతం పరిస్థితి దిగజారుతోంది. 2008 తరహా మాంద్యం యొక్క లక్షణాలు దేశంలో కనిపించడం ప్రారంభించాయి.
Waqf Bill: వక్ఫ్ (సవరణ) బిల్లును పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి అందిన 1.25 కోట్ల సమర్పణలపై విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కోరారు. దీని వెనక వాంటెడ్ ఇస్లామిస్ట్ బోధకుడు జకీర్ నాయక్, పాకిస్తాన్ ఐఎస్ఐ, చైనాల పాత్ర ఉందని అతడు అనుమానించారు.
UNSC: అమెరికా, ఫ్రాన్స్ తర్వాత UNSCలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం బ్రిటన్ మద్దతును పొందింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC శాశ్వత సీటు) కోసం ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ గురువారం భారతదేశానికి మద్దతు ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రాన్స్‌కు చెందిన ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా భారత్‌కు మద్దతు పలికారు. న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 69వ సెషన్లో జరిగిన చర్చలో, బ్రిటిష్ ప్రధాన మంత్రి స్టార్మర్…
Asia power index: ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఖ్యాతి పెరుగుతోంది. ఇప్పుడున్న ప్రపంచ సమస్యల పరిష్కారానికి భారత చొరవ లేకుండా ఏ దేశం కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఆర్థికం బలపడటంతో పాటు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉండటం భారత్ గొప్పతనం. ఇదిలా ఉంటే ‘‘ఆసియా పవర్ ఇండెక్స్’’ రీజినల్ పవర్స్లో భారతదేశం సత్తా చాటింది.
అక్రమంగా సంపాదించారనే ఆరోపణలపై చైనాలో ఓ మహిళా అధికారికి 13 ఏళ్ల జైలు శిక్ష పడింది. అంతేకాకుండా.. 10 లక్షల యువాన్లు (సుమారు రూ. 1.18 కోట్లు) జరిమానా విధించారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. ఝాంగ్ యాంగ్ గుయిజౌ కియానాన్ ప్రావిన్స్‌కు గవర్నర్‌గా ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ)లో డిప్యూటీ సెక్రటరీగా కూడా పనిచేశారు.
New Chinese Heliport: అరుణాచల్ ప్రదేశ్‌లోని సున్నితమైన 'ఫిష్‌టెయిల్స్' ప్రాంతానికి సమీపంలో వాస్తవ నియంత్రణ రేఖకు తూర్పున 20 కిలోమీటర్ల దూరంలో కొత్త హెలిపోర్ట్ ను డ్రాగన్ కంట్రీ నిర్మిస్తుంది. మారుమూల ప్రాంతంలోకి సైనికు వేగంగా తరలించే సామర్థ్యాన్ని చైనా సాయుధ దళాలు రెడీ చేసుకుంటున్నాయి.
యాగీ తుఫాన్ వల్ల కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. భారీ వరదలు వస్తుండటంతో పెద్ద ఎత్తున కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో దాదాపు 226 మంది మరణించగా.. మరో 77 మంది తప్పిపోయినట్లు అధికారులు తెలిపారు.