లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసి)పై పెట్రోలింగ్‌కు సంబంధించి భారతదేశం-చైనా మధ్య కొత్త ఒప్పందం కుదిరింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మాట్లాడుతూ.. గత కొన్ని వారాలుగా దౌత్య, సైనిక స్థాయిలో భారతదేశం-చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయని.. తాము చైనాతో సమస్యలపై ఒక ఒప్పందానికి వచ్చామని చెప్పారు. అలాగే.. బలగాల ఉపసంహరణ, పరిస్థితిని చక్కదిద్దేందుకు పెట్రోలింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. మరోవైపు.. ద్వైపాక్షిక చర్చలపై విలేకరులు ప్రశ్నలు సంధించారు. దీనిపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ స్పందిస్తూ.. సమయానుకూలంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.
Read Also: Supreme Court: ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ.. విచారణ వాయిదా
విదేశాంగ కార్యదర్శి మాట్లాడుతూ.. “గత కొన్ని వారాలుగా జరిగిన చర్చల కారణంగా, భారతదేశం-చైనా సరిహద్దు ప్రాంతంలో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్ ఏర్పాట్లపై ఏకాభిప్రాయం కుదిరింది. 2020లో ఈ ప్రాంతాల్లో తలెత్తిన సమస్యలు పరిష్కారమవుతున్నాయి. సరిహద్దు సమస్యలను పరిష్కరించడానికి గత కొన్ని వారాలుగా భారత్, చైనా చర్చలు సంప్రదింపులు జరుపుతున్నారు. “ఈ ఒప్పందం డెప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాలలో పెట్రోలింగ్ ఏర్పాట్లకు సంబంధించినది.” అని తెలిపారు.
Read Also: Actress Shabrin: మేనమామతో ప్రేమాయణం.. మేనల్లుడి కిడ్నాప్ కేసులో నటి అరెస్ట్
తూర్పు లడఖ్ సరిహద్దులో 2020లో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించారు. అదే సమయంలో చైనా సైనికులు మరణించారు. అప్పటి నుండి రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి.