కశ్మీర్‌లోని గందర్బాల్ జిల్లాలో సొరంగం నిర్మాణ సంస్థ క్యాంప్‌సైట్‌పై ఆదివారం రాత్రి ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఒక వైద్యుడు, ఆరుగురు కార్మికులు మరణించారు.
India China LAC: భారత్ – చైనా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) పై పెట్రోలింగ్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేశాయి ఇరు దేశాలు. ఇరుదేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించడంలో, సరిహద్దు నుండి దళాల ఉపసంహరణ ప్రక్రియను తగ్గించడంలో ఈ ఒప్పందం ప్రధాన చర్యగా పరిగణించబడుతుంది. Read Also: Bomb Threat: 30 విమానాలను పైగా బాంబు బెదరింపులు.. 8 రోజుల్లో 120కి…
లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసి)పై పెట్రోలింగ్‌కు సంబంధించి భారతదేశం-చైనా మధ్య కొత్త ఒప్పందం కుదిరింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మాట్లాడుతూ.. గత కొన్ని వారాలుగా దౌత్య, సైనిక స్థాయిలో భారతదేశం-చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయని.. తాము చైనాతో సమస్యలపై ఒక ఒప్పందానికి వచ్చామని చెప్పారు.
ప్రముఖ టెక్ కంపెనీ నోకియా లేఆఫ్‌లు ప్రకటించింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. కంపెనీ 2000 మందిని తొలగించింది. గ్రేటర్ చైనాలో నోకియా ఈ తొలగింపును చేసింది. అంతకుముందు ఖర్చులను తగ్గించుకునేందుకు యూరప్‌లో 350 మందిని కంపెనీ తొలగించింది. యూరప్‌లో ఉద్యోగుల తొలగింపులను కంపెనీ ప్రతినిధి ధృవీకరించారు.
Nitin Gadkari: తమ మంత్రిత్వ శాఖ అనేక హైవేలను, ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మిస్తుండటంతో వచ్చే రెండేళ్లలో భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు జీడీపీలో 9 శాతానికి తగ్గిపోతుందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
China Taiwan: చైనా, తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్తత నిరంతరం పెరుగుతోంది. మరోసారి చైనా సైన్యం తైవాన్ సరిహద్దుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. అయితే తైవాన్ సైన్యం కూడా స్పందించింది. తైవాన్ సరిహద్దుకు సమీపంలో చైనా విమానాలు, నౌకాదళ నౌకలు కనిపించాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 6 గంటలకు తైవాన్ చుట్టూ 14 చైనా నౌకాదళ నౌకలు, 12 అధికారిక నౌకలు కనిపించాయని తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ (MND) తెలిపింది.…
Pakistan SCO Meeting: పాకిస్థాన్ వేదికగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు నేటి (మంగళవారం) నుంచి ప్రారంభం కానుంది. ఇందు కోసం పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
భారత్ భద్రత కోసం తాజాగా పెద్ద అడుగు వేసింది. రెండు కొత్త అణు జలాంతర్గాముల నిర్మాణానికి భారత్ ఆమోదం తెలిపింది. ప్రధాని నేతృత్వంలోని భద్రతపై కేబినెట్ కమిటీ రెండు స్వదేశీ అణు జలాంతర్గాములను నిర్మించేందుకు అనుమతి ఇచ్చింది.
Rajnath Singh: దేశ సరిహద్దులో భారత సైన్యం అలర్ట్ గా ఉందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అందువల్లే సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్తతలు జరగడం లేదన్నారు. కానీ, ఈ విషయంలో అజాగ్రత్త పనికి రాదు.. పొరుగు దేశాల నుంచి కవ్వింపు చర్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేశారు.
చైనా ప్రధాని లీ కియాంగ్‌కు పాకిస్థాన్ కొత్త గిఫ్ట్ ఇచ్చింది. ఈ రోజు ఉదయం, చైనా ఇంజనీర్లను చంపిన ఇద్దరు ఉగ్రవాదులను పాకిస్థాన్‌కు రాకముందే జైలుకు తరలించే పేరుతో..పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ సినిమా శైలిలో వారిని హతమార్చింది.