ఆపిల్ ఇప్పుడు తన ఐఫోన్17 యొక్క బేస్ మోడల్‌పై పని చేయడం ప్రారంభించినట్లు సమాచారం. దీనిని ఆపిల్ కంపెనీ వచ్చే ఏడాది సెప్టెంబర్ 2025 నెలలో ప్రారంభించవచ్చని అంచనాలు ఉన్నాయి. గత నెలలో యాపిల్ భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 16 సిరీస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
గత కొన్ని సంవత్సరాలుగా.. దీపావళి, ధన్తేరస్లలో భారతీయ మార్కెట్లలో చైనా ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతోంది. ముఖ్యంగా అలంకరణ వస్తువుల విక్రయాలు గతంతో పోలిస్తే ఈ సారి గణనీయంగా తగ్గాయి. తక్కువ డిమాండ్ కారణంగా.. దిగుమతులు కూడా తగ్గుతున్నాయి. దీని కారణంగా దేశీయ వస్తువుల అమ్మకాలు పెరుగుతున్నాయి. నిజానికి ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రచార ప్రభావం ఇప్పుడు దేశంలో కనిపిస్తోంది. దేశీయ వస్తువులనే కొనుగోలు చేయాలన్న ఆయన నినాదం చైనాపై తీవ్ర ప్రభావం…
Population Increased: చైనాలో జననాల రేటు గత రెండు సంవత్సరములుగా నిరంతరం తగ్గుతోంది. ఈ పరిస్థితిలో చైనా అనేక విధానాలను ప్రకటించింది. ఇందులో పిల్లల పుట్టుకపై సబ్సిడీ విధానం, అలాగే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్న కుటుంబ సభ్యులకు పన్ను తగ్గింపు వంటి విధానాలు ఉన్నాయి. జననాల రేటును పెంచడానికి, ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండేలా ప్రజలను ప్రోత్సహించడం దీని లక్ష్యం. పిల్లల జనన రేటును పెంచేందుకు వీలుగా చైనా స్టేట్ కౌన్సిల్ సోమవారం…
China Launched Shenzhou-19: చైనా తన అంతరిక్ష యాత్ర షెంజో-19ని బుధవారం ప్రయోగించింది. ఈ మిషన్ కింద, చైనా తన అంతరిక్ష కేంద్రానికి ఆరు నెలల మిషన్ కోసం ముగ్గురు వ్యోమగాములను పంపింది. ఈ మిషన్‌లో చారిత్రక విషయం ఏమిటంటే.. చైనాకు చెందిన తొలి మహిళా స్పేస్ ఇంజనీర్ ఈ మిషన్‌లో ప్రయాణించడం. వాయువ్య చైనాలోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఉదయం 4:27 గంటలకు (బీజింగ్ కాలమానం ప్రకారం) ఈ మిషన్ బయలుదేరిందని చైనా…
భారత్-చైనా దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందంలో భాగంగా తూర్పు లడఖ్‌లోని దెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో భారత్, చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది.
China: చైనా తీవ్రమైన జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అక్కడి యువత వివాహాలు చేసుకోవడానికి, పిల్లల్ని కనేందుకు ఇష్టపడటం లేదు. వరసగా రెండో ఏడాది కూడా ఆ దేశంలో శిశు జననాలు తగ్గాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆ దేశం పిల్లలు కనడాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది.
ఇజ్రాయెల్ ముందే హెచ్చరించినట్టుగా ఇరాన్‌పై దాడులకు తెగబడింది. శనివారం ఇరాన్ వైమానికి స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. దీంతో తమ లక్ష్యాలను పూర్తి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ వైమానికి స్థావరాలు ధ్వంసం అయినట్లుగా తెలుస్తోంది.
అమెరికా, చైనాల మధ్య శత్రుత్వం ప్రపంచానికి దాపురించింది. వీరిద్దరి మధ్య చాలా కాలంగా ట్రేడ్ వార్ నడుస్తోంది. దీని ప్రయోజనాన్ని పొందడానికి, భారతదేశం తన తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేసింది.
PM Modi- Xi Jinping: బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సమ్మిట్ కోసం రష్యాలోని కజాన్ నగరానికి వెళ్లిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు (బుధవారం) చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం కానున్నారు.