China Launched Shenzhou-19: షెన్‌జౌ-19 అంతరిక్ష యాత్రను ప్రారంభించిన చైనా
- షెన్‌జౌ-19 అంతరిక్ష యాత్రను ప్రారంభించిన చైనా.
- వాయువ్య చైనాలోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఉదయం 4:27 గంటలకు
- ఈ మిషన్‌లో చైనా తొలి మహిళా స్పేస్ ఇంజనీర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Launched Shenzhou-19: చైనా తన అంతరిక్ష యాత్ర షెంజో-19ని బుధవారం ప్రయోగించింది. ఈ మిషన్ కింద, చైనా తన అంతరిక్ష కేంద్రానికి ఆరు నెలల మిషన్ కోసం ముగ్గురు వ్యోమగాములను పంపింది. ఈ మిషన్‌లో చారిత్రక విషయం ఏమిటంటే.. చైనాకు చెందిన తొలి మహిళా స్పేస్ ఇంజనీర్ ఈ మిషన్‌లో ప్రయాణించడం. వాయువ్య చైనాలోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఉదయం 4:27 గంటలకు (బీజింగ్ కాలమానం ప్రకారం) ఈ మిషన్ బయలుదేరిందని చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ (CMSA) తెలిపింది. మిషన్ ప్రారంభించిన 10 నిమిషాల తర్వాత, షెంజౌ-19 అంతరిక్ష నౌక రాకెట్ నుండి విడిపోయి దాని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. వ్యోమగాములందరూ క్షేమంగా ఉన్నారని, ప్రయోగం పూర్తిగా విజయవంతమైందని CMSA తెలిపింది.
Also Read: WTC 2024-25: మూడో టెస్టులోనూ ఓడితే.. ఫైనల్ ఆశలు గల్లంతయినట్లే!
Also Read
- Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
- Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
- The Muslim 500 List 2027: ప్రపంచంలో టాప్-500 ముస్లింల జాబితా.. షారూఖ్‌తో సహా భారత్ నుంచి 22 మంది!
- UP Congress-SP Alliance: 181 సీట్లు కోరుతున్న కాంగ్రెస్.. లీకైన జాబితాతో అఖిలేష్‌పై ఒత్తిడి!
ఇక ఈ మిషన్‌లో ఎవరు పాల్గొంటున్నారన్న విషయానికి వెళితే.. షెన్‌జౌ-19 సిబ్బందిలో మిషన్ కమాండర్ కై జుజే మరియు వ్యోమగాములు సాంగ్ లింగ్డాంగ్, వాంగ్ హవోజ్ ఉన్నారు. కై జుజే ఒక అనుభవజ్ఞుడైన వ్యోమగామి. దీనికి ముందు అతను 2022 సంవత్సరంలో షెన్‌జౌ-14 మిషన్‌లో అంతరిక్షంలో ప్రయాణించాడు. మొదటిసారిగా అంతరిక్షంలోకి అడుగుపెట్టిన చైనా వ్యోమగాముల మూడవ బ్యాచ్‌లో భాగమైన సాంగ్, వాంగ్ ఇద్దరూ 1990లలో జన్మించారు. వాంగ్ ప్రస్తుతం చైనా సంబంధించి ఏకైక మహిళా అంతరిక్ష ఇంజనీర్. అలాగే ఆమె అంతరిక్ష యాత్రలో చేరిన మూడవ చైనా మహిళ అని ఏజెన్సీ తెలిపింది.
ఈ మిషన్‌లోని వ్యోమగాములు అంతరిక్ష శాస్త్రం, అప్లికేషన్ల పరీక్షలను నిర్వహించడం, రక్షణ పరికరాలను ఇన్స్టాల్ చేయడం ఇంకాఅదనపు వాహన పేలోడ్లు, పరికరాల ఇన్స్టాలేషన్, రీసైక్లింగ్‌ను నిర్వహించడం వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. స్పేస్ లైఫ్ సైన్స్, మైక్రోగ్రావిటీ ఫండమెంటల్ ఫిజిక్స్, స్పేస్ మెటీరియల్స్ సైన్స్, స్పేస్ మెడిసిన్, కొత్త స్పేస్ టెక్నాలజీలతో సహా అనేక రంగాలను కవర్ చేస్తూ 86 స్పేస్ సైన్స్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ ప్రయోగాలు నిర్వహిస్తారని CMSA ప్రతినిధి లిన్ జికియాంగ్ మంగళవారం తెలిపారు. చైనా తన అంతరిక్ష కేంద్రంలో 130కి పైగా సైంటిఫిక్ రీసెర్చ్, అప్లికేషన్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించిందని ఏప్రిల్‌లో CMSA వెల్లడించింది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్‌కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!