India’s Manufacturing Sector Surges: చైనా ఆట ముగిసింది?.. తయారీ రంగంలో దూసుకుపోతున్న భారత్
- తయారీ రంగంలో దూసుకుపోతున్న భారత్
- చైనా దాటేసిందని తెలిసిన హెచ్‌ఎస్‌డీసీ నివేదిక
- భారత్‌లో తయారయ్యే వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్
- అధిక ఆర్డర్లను పొందుతున్న తయారీ రంగం
- ఉద్యోగులు సంఖ్య పెరుగుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తయారీ రంగంలో గొప్పగా చెప్పుకునే చైనా ఇప్పుడు ఇందులో చాలా వెనుకబడిపోయింది. ఒకవైపు చైనా ఆర్థిక వృద్ధి చాలా నెమ్మదిగా ఉండగా.. భారత్‌కు శుభవార్త అందింది. హెచ్‌ఎస్‌డీసీ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. భారత్ యొక్క తయారీ రంగం అక్టోబర్‌లో విస్తరించింది. ఈ విషయంలో భారత్ చైనాను అధికమించిందని నివేదిక తెలిపింది. ఈ పెరుగుదలకు కారణం విదేశాల్లో భారత్ వస్తువులకు డిమాండ్ పెరిగింది. భారతదేశం ప్రపంచంలోని అనేక దేశాల నుంచి కొత్త ఆర్డర్‌లను అందుకోవడమే కాకుండా అమ్మకాలు కూడా పెరిగాయి. దీంతో అక్టోబర్‌లో ఉద్యోగాల సంఖ్య కూడా పెరిగింది. అక్టోబర్‌లో భారతదేశం ఆసియా, యూరప్, లాటిన్ అమెరికా, అమెరికా నుంచి మరిన్ని ఆర్డర్‌లను పొందింది. దీని కారణంగా తయారీ రంగం విజృంభించింది.
భారత్ పురోగతి?
అక్టోబర్‌లో ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 57.5 పాయింట్లకు పెరిగింది. ఇది సెప్టెంబర్‌లో 56.5 పాయింట్లు గా ఉండేది. పెరుగుతున్న పీఎమ్‌ఐ ఆపరేటింగ్ పరిస్థితులు గణనీయంగా మెరుగుపడుతున్నాయని హెచ్‌ఎస్‌డీసీ నివేదిక స్పష్టం చేస్తోంది. మరోవైపు చైనా పీఎంఐ 50.30 పాయింట్లుగా ఉంది. అయితే.. అక్టోబర్‌లో చైనా పీఎమ్‌ఐలో కొంత పెరుగుదల కనిపించింది. కానీ టోటల్ పాయింట్లలో భారత్ కంటే వెనుకబడి ఉంది.
Also Read
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
భారతదేశంలో తయారయ్యే వస్తువులకు డిమాండ్ ..
ఇటీవలి కాలంలో భారతదేశంలో తయారైన వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. చాలా విదేశీ కంపెనీలు భారీ సంఖ్యలో ఆర్డర్లను బుక్ చేసుకున్నాయి. ప్రస్తుత దశలో ఆర్డర్‌ల సంఖ్య గత 20 ఏళ్లలో వచ్చిన ఆర్డర్‌ల సగటు సంఖ్యను మించిపోయింది. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, విజయవంతమైన మార్కెటింగ్ వస్తువుల అమ్మకాలను పెంచడంలో సహాయపడిందని నివేదిక పేర్కొంది.
ఉద్యోగుల సంఖ్య పెరుగుదల…
డిమాండ్ పెరగడంతో ఉద్యోగుల సంఖ్య కూడా పెరిగింది. అంటే ఉపాధి అవకాశాలు పెరిగాయి. తాజా డేటా ప్రకారం.. తయారీదారులు అక్టోబర్‌లో అదనపు ఉద్యోగులను నియమించుకున్నారు. ఈ సంఖ్య సెప్టెంబరులో కొత్తగా తీసుకున్న ఉద్యోగుల కంటే ఎక్కువ. అక్టోబర్ డేటా సేకరణ దాదాపు 20 ఏళ్లలో అత్యధికం. భవిష్యత్ ఉత్పత్తి వాల్యూమ్‌ల గురించి భారతీయ తయారీదారులు మరింత ఆశాజనకంగా మారారని హెచ్‌ఎస్‌బీసీ నివేదిక పేర్కొంది.
తాజావార్తలు
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!