China: చైనా తీవ్రమైన జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అక్కడి యువత వివాహాలు చేసుకోవడానికి, పిల్లల్ని కనేందుకు ఇష్టపడటం లేదు. వరసగా రెండో ఏడాది కూడా ఆ దేశంలో శిశు జననాలు తగ్గాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆ దేశం పిల్లలు కనడాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రసవం, శిశు సంరక్షణ సేవల్ని బలోపేతం చేయడంపై దృష్టిసారించినట్లు అక్కడి జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ‘‘చైల్డ్ బర్త్-ఫ్రెండ్లీ సొసైటీ’’ని సృష్టించడానికి కొత్త చర్యల్ని ప్రారంభించింది. దేశంలో జననాల రేటు గణనీయంగా తగ్గుతున్న సందర్భంలో ఈ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది.
Read Also: Akkineni Nageswara Rao Last Message: ANR చివరి మాటలు.. కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి
ఈ చర్యలు శిశుజననం మరియు శిశు సంరక్షణ సేవలను బలోపేతం చేయడం, విద్య, గృహం మరియు ఉపాధిలో మద్దతును విస్తరించడం మరియు వివాహం మరియు పిల్లలను కనడం చుట్టూ ‘‘న్యూ కల్చర్’’ని పెంపొందించడంపై పెడుతుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. చైనా విద్యామంత్రిత్వ శాఖ డేటాని ఉటంకిస్తూ..2023లో దేశంలో ‘‘కిండర్ గార్టెన్ల’’ సంఖ్య 14,808కి తగ్గిందని, మొత్తంగా దేశంలో 2,74,400కి తగ్గిందని వెల్లడించింది. వరసగా రెండో ఏడాది కూడామ జననాల రేటు తగ్గిపోవడాన్ని కథనం హైలెట్ చేసింది.
2023లో చైనా జనాభా రెండు మిలియన్లు తగ్గింది. 1949 తర్వాత తొలిసారిగా అత్యల్పంగా 2023లో 9 మిలియన్ల జనాభా నమోదైంది. చైనా ఇప్పుడు రెండు రకాల జనాభా సవాళ్లని ఎదుర్కొంటోంది. తగ్గుతున్న జనాభాతో పాటు, వృద్ధ జనాభా క్రమంగా పెరుగుతోంది. 2023 చివరి నాటికి చైనాలో దాదాపుగా 30 కోట్ల మంది 60 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు గలవారే ఉన్నారు. 2035 నాటికి ఈ సంఖ్య 40 కోట్లకు మించుతుందని, 2050 నాటికి 50 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. 2016 వరకు చైనా అవలంభించిన ‘‘వన్ చైల్డ్’’ విధానానికి జనాభా సంక్షోభం ఎక్కువ కారణమని చెప్పవచ్చు. 2021లో ప్రభుత్వం ఈ విధానాన్ని మరింత సవరించి, కుటుంబానికి ముగ్గురు పిల్లలను కలిగి ఉండేలా అనుమతినిచ్చింది.