Womens Asian Champions Trophy 2024: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ విజేతగా భారత్..
- ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్
- బుధవారం ఫైనల్‌లో 1-0తో చైనాను చిత్తు చేసిన భారత్
- మహిళల ఛాంపియన్స్ ట్రోఫీని వరుసగా రెండోసారి కైవసం చేసుకున్న ఇండియా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత అమ్మాయిల హాకీ జట్టు అదరగొట్టింది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఓటమి అనేది ఎరుగకుండా టైటిల్‌ను కైవసం చేసుకుంది. బుధవారం ఫైనల్‌లో 1-0తో చైనాను చిత్తు చేసి ఛాంపియన్‌గా నిలిచింది. దీపిక 31వ నిమిషంలో గోల్ చేసి భారత్‌ను ఆధిక్యంలో నిలిపింది. దీంతో.. ఆసియా మహిళల ఛాంపియన్స్ ట్రోఫీని వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది.
Read Also: Exit Polls: ఎగ్జిట్ పోల్స్ సంచలన ఫలితాలు.. గెలుపు ఎవరిదంటే..?
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
మొత్తంగా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ మూడోసారి గెలుచుకుంది. అంతకుముందు 2023లో రాంచీలో, 2016లో సింగపూర్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. భారత మహిళల జట్టు హరేంద్ర సింగ్ హయాంలో (ప్రధాన కోచ్‌గా ఉన్నప్పుడు) తొలి టైటిల్‌ను గెలుచుకుంది. తాజా విజయంపై.. భారతీయులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో ఘోర పరాజయం పాలైన భారత మహిళల హాకీ జట్టు.. ఈ టోర్నీలో ఒక్క ఓటమి లేకుండా అత్యుత్తమ జట్టుగా నిలిచింది.
Read Also: Hyderabad: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం..
ఈ టోర్నీలో ఆడిన ఏడు గేమ్‌ల్లో గెలుపొందింది. గ్రూప్ దశలో భారత్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. మంగళవారం జరిగిన సెమీస్‌లో జపాన్‌ను 2-0తో ఓడించింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో రజత పతకం సాధించిన చైనా.. టోర్నీలో అత్యధిక ర్యాంక్ సాధించిన జట్టుగా నిలిచింది. ఈ టోర్నీలో చైనా తన 5 పూల్ గేమ్‌లలో 4 గెలిచింది. సెమీస్‌లో మలేషియాను 3-1 తేడాతో ఓడించింది.
🏆 Champions Again! 🇮🇳🔥
Team India clinches the Bihar Women’s Asian Champions Trophy Rajgir 2024 title with a stellar 1-0 victory over China! 🎉💪 The defending champions have shown their grit, skill, and determination, proving once again why they are on top of Asia.
Another… pic.twitter.com/RkCxRI2Pr2
— Hockey India (@TheHockeyIndia) November 20, 2024
- Tags
- beats
- china
- defends
- india
- telugu news
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?