China: పది రోజులు మంచులో చిక్కుకున్న యువకుడు.. ఆకలి బరించలేక టూత్ పేస్ట్ తిని..
- మంచు పర్వతంపై తప్పిపోయిన యువకుడు
- ఆకలి తీర్చుకునేందుకు టూత్ పేస్ట్ తిన్న యువకుడు
- అతడి ప్రాణాలు కాపాడిన రెస్క్యూ టీం
- అసలు ఏం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్ని సంఘటనలు ప్రజలను నవ్విస్తాయి. మరి కొన్ని నెటిజన్లను ఆశ్చర్యపరుస్తాయి. ఇలాంటి ఓ ఆశ్చర్య పరిచే ఘటన చైనాలో జరిగింది. వాయువ్య చైనాలోని మంచు పర్వతంపై 18 ఏళ్ల యువకుడు 10 రోజుల పాటు మంచులో చిక్కుకున్నాడు. ఆహారం లేక పోవడంతో విలవిల లాడాడు. 10 రోజుల తర్వాత రెస్క్యూ అండ్ రిలీఫ్ టీం ఆ యువకుడని గుర్తించింది. ఆ టీం అతని ప్రాణాలు కాపాడింది. ఈ పది రోజుల పాటు ఆహారం లేకపోవడంతో అతడు చాలా బలహీనంగా మారాడు. ఆహారం కొరతగా ఉన్నప్పటికీ నది నీళ్లు తాగుతూ.. ఆకలి తీర్చుకోవడానికి తన వద్ద ఉన్న టూత్‌పేస్ట్ సైతం తిన్నాడు.
READ MORE: IND vs NZ: ఇండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కెప్టెన్ రోహిత్ ఔట్..!
Also Read
- Viral News: చెప్పులు చేతిలో పట్టుకుని పరుగెత్తింది.. కూతుళ్ల చదువు కోసం మారథాన్ గెలిచిన తల్లి కథ!
- Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
- Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. 18 ఏళ్ల సన్ లియాంగ్ పర్వాతారోహకుడు. ఫిబ్రవరి 8న షాంగ్జీ ప్రావిన్స్‌లోని అత్యంత ప్రమాదకరమైన పర్వతాలలో ఒకటైన క్విన్లింగ్ పర్వతాలను ఒంటరిగా అధిరోహించేందుకు వెళ్లాడు. ఈ పర్వతంపై అసాధారణ వాతావరణం ఉంది. ఈ పర్వతం అధిరోహించడం ఓ కఠినమైన చర్య. ఈ పర్వతంపై అనేక రకాల జంతువులు కూడా ఉంటాయి. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా.. లియాంగ్ తన అడుగులు ముందుకు వేశాడు. కానీ కేవలం రెండు రోజులకే తప్పిపోయాడు. దారి తప్పి, లియాంగ్ నది ఒడ్డున నడుస్తూనే ఉన్నాడు. పర్వతంపై నుంచి పడి కుడి చేయి విరిగి పోయింది. దీంతో అతను ఒక చోట ఆకుల సహాయంతో తాత్కాలిక మంచం ఏర్పాటు చేసుకున్నాడు. తీవ్రమైన చలితో ఇబ్బంది పడుతూ సహాయం కోసం ఎదురు చూశాడు.
READ MORE: MLC Kavitha : రెండో దఫా కులగణనలో లోపాలు – బీసీల హక్కులకు ముప్పు
కుటుంబంతో లియాంగ్ సంబంధాలు కట్ అవ్వడంతో అతన్ని సంప్రదించలేకపోయారు. ఈ సమాచారాన్ని స్థానిక రెస్క్యూ బృందాలకు తెలియజేస్తారు. రోజుల తరబడి కష్టపడి వెతికిన టీం సభ్యులు ఫిబ్రవరి 17న అతన్ని కనుగొన్నారు. రెస్క్యూ టీం ప్రకారం.. బాలుడు ప్రమాదకరమైన కొండను ఎక్కుతున్నాడు. గత 20 ఏళ్లలో ఈ మార్గంలో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాల దృష్ట్యా, స్థానిక పరిపాలన 2018 లో ఈ పర్వతాన్ని ఎక్కడం నిషేధించింది. కానీ.. కొంతమంది ధైర్యవంతులు రిస్క్ తీసుకుంటూనే ఉన్నారు. ఈ ప్రమాదకరమైన ప్రాంతంలో తప్పిపోయి నిర్జీవంగా దొరికి వ్యక్తి లియాంగ్ మాత్రమే.
తాజావార్తలు
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
-
Bigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్‌లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
Hindu Temple Demolition: పాకిస్థాన్‌లో 125 ఏళ్ల పురాతన హిందూ ఆలయం కూల్చివేత.. హిందూ సంఘాల ఆందోళన!
-
OG 2 update : OG2 టైమ్ వచ్చింది.. కానీ డౌటే?
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!