AI Robo: కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – AI) ఆధారంగా రూపొందించిన రోబోలు మనిషి జీవనశైలిలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. వీటి సహాయంతో పరిశ్రమలు, ఆరోగ్య రంగం, విద్య, భద్రత వంటి అనేక విభాగాల్లో నూతన మార్గాలు సృష్టించబడుతున్నాయి. హ్యూమనాయిడ్ రోబోలు, ముఖ్యంగా, మనుషులను అనుకరించే విధంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఇవి మానవ చర్యలను అర్థం చేసుకోవడం, అందుకు అనుగుణంగా స్పందించడం వంటి పనులు చేస్తాయి. కానీ, తాజా సంఘటనలు ఈ రోబోల భద్రతపై కొత్త చర్చలను తెరపైకి తెచ్చాయి.
Read Also: MLC Elections 2025: బీజేపీ VS పోలీసులు.. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత..
చైనాలోని టియాంజిన్ నగరంలో నిర్వహించిన స్ప్రింగ్ ఫెస్టివల్ గాలాలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకలో భాగంగా ప్రదర్శనకు ఉంచిన ఓ హ్యూమనాయిడ్ రోబో అకస్మాత్తుగా అదుపు తప్పి, జనాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. దీనితో అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి, రోబోను నియంత్రించే ప్రయత్నం చేశారు. ఈ రోబో చూడటానికి చాలా ఆకర్షణీయంగా, కలర్‌ఫుల్‌గా ఉన్నా.. మొదటిలో ఇది సాధారణంగా ప్రవర్తించగా, కొద్ది సేపటి తర్వాత అనుకోకుండా జనాల మీదకు దూసుకొచ్చింది. బారికేడ్ బయట ఉన్న ప్రజలపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో అక్కడ హడావుడి మొదలైంది. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి, రోబోను సమర్థంగా అదుపులోకి తెచ్చారు. అయితే, అదే సమయంలో ప్రదర్శనలో ఉన్న మరొక రోబో మాత్రం ప్రశాంతంగా ఉండటం గమనార్హం.
ఈ ఘటనకు సంబంధించి ఈవెంట్ నిర్వాహకులు స్పందిస్తూ.. ఇది కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగిన ఘటన మాత్రమేనని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముందు అన్ని రకాల భద్రతా పరీక్షలు నిర్వహించినప్పటికీ, ఇలా జరగడం చాలా విచిత్రమని అన్నారు. టెక్నికల్ నిపుణుల ప్రకారం, సాఫ్ట్‌వేర్ గ్లిచ్ వల్ల రోబో తప్పుగా ప్రవర్తించి ఉండొచ్చని భావిస్తున్నారు. అయినప్పటికీ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా మరింత మెరుగైన భద్రతా చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు హామీ ఇచ్చారు.
Read Also: MLC Kavitha: మా కుటుంబం మీద దాడి తప్ప మరోకటిలేదు.. సీఎంపై కవిత ఫైర్
🚨🇨🇳AI ROBOT ATTACKS CROWD AT CHINESE FESTIVAL
A humanoid robot suddenly stopped, advanced toward attendees, and attempted to strike people before security intervened.
Officials suspect a software glitch caused the erratic behavior, dismissing any intentional harm.
This comes… pic.twitter.com/xMTzHCYoQf
— Mario Nawfal (@MarioNawfal) February 25, 2025
ఇలాంటి సంఘటనలు AI ఆధారిత రోబోల భద్రతపై సర్వత్రా చర్చను తెరపైకి తెస్తున్నాయి. రోబోల ప్రవర్తన పూర్తిగా నియంత్రణలో ఉండేలా మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా, అవి జనసమూహాల మధ్య వినియోగంలో ఉన్నప్పుడు, ఆపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు భద్రతా చర్యలు తప్పనిసరి. AI టెక్నాలజీ వృద్ధి చెందుతున్న కొద్దీ, భద్రతా ప్రమాణాలను కూడా నిర్ధారించుకోవడం అనివార్యం. ఈ ఘటన రోబోలను ప్రదర్శించే కార్యక్రమాల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. భవిష్యత్తులో AI ఆధారిత రోబోలు మన జీవితాల్లో మరింత ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి. అయితే, వాటి వినియోగంలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం.