2019లో చైనాలో మొదలైన కరోనా ఆ తరువాత మహమ్మారిగా మారి ప్రపంచం మొత్తం వ్యాపించింది. ప్రపంచంలోని అనేక దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడంతో వ్యాక్సిన్‌ను వేగవంతం చేశాయి. అయితే, ఫైజర్, మోడెర్నా, ఆక్స్ఫర్డ్-అస్త్రాజెనకా టీకాలు కొంత ఖరీదుతో కూడుకొని ఉన్నాయి. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు చైనా రెండు రకాల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నది. Read: కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా పేరేమిటంటే…? ఈ…
పేపర్ లేదా సంప్రదాయ కరెన్సీకి బదులుగా వచ్చిన క్రిప్టో కరెన్సీని తీసుకొచ్చారు. 2003 నుంచి క్రిప్టో కరెన్సీ వాడుకలో ఉన్నా,ఇటీవల కాలంలోనే దీని విలువ ప్రపంచానికి తెలిసింది. క్రిప్టో కరెన్సీలో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ, బిట్‌కాయిన్ అందరికీ సుపరిచితమైంది. ప్రముఖ మోటార్స్ కంపెనీ టెస్లా, కార్ల కొనుగోలుకు క్రిప్టో కరెన్సీని అనుమతించబోమని చెప్పడంతో బిట్‌కాయిన్ విలువ భారీగా పతనం అయింది. 75 వేల డాలర్ల నుంచి ఏకంగా 35వేల డాలర్లకు పడిపోయింది. ఏ దేశం కూడా ఈ…
చైనాకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్సంగ్… చైనాలో నిర్మించాలనుకున్న డిస్ ప్లే తయారీ యూనిట్లను యూపీలోని నోయిడాకు షిఫ్ట్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే శామ్సంగ్ సంస్థ నైరుతి ఆసియా అధ్యక్షుడు, సీఈఓ కెన్ కాంగ్ నేతృత్వంలోని శామ్సంగ్ ప్రతినిధి బృందం యూపీ సీఎం యోగిని కలిసింది. మెరుగైన పారిశ్రామిక వాతావరణం, పెట్టుబడిదారుల- స్నేహపూర్వక విధానాల కారణంగా.. తమ యూనిట్‌ను నోయిడాలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు శామ్సంగ్ సంస్థ…
నేపాల్ పై చైనా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనాలో తయారైనా సీనోఫామ్ వ్యాక్సిన్లను నేపాల్‌లో వేస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ విషయంలో రెండు దేశాల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం వ్యాక్సిన్ ధరను బహిర్గతం చేయకూడదు. కానీ, సీనోఫామ్ వ్యాక్సిన్ టీకా ధరను కొన్ని మీడియా సంస్థలు బహిర్గతం చేయడంతో చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ధరల విషయం బహిర్గతం కావడానికి కారకులపై చర్యలు తీసుకోవడానికి నేపాల్ ప్రభుత్వం సిద్ధం అయింది. ఒక్కో…
ఇంటిని నిర్మాణం చేయాలంటే కనీసం నెల రోజుల సమయం పడుతుంది. టెక్నాలజీని వినియోగించుకొని, భవనాన్ని నిర్మించినా, కనీసం నాలుగైదు రోజుల సమయం పడుతుంది. 10 అంతస్థుల భవనాన్ని ఒక్కరోజులో నిర్మించడం అంటే మాములు విషయం కాదు. చాలా కష్టమైన విషయంగా చెప్పాలి. మౌలిక సదుపాయాల విషయంలో ముందున్న చైనా, 10 అంతస్థుల భవనాన్ని ఒకే ఒక్కరోజులోనే నిర్మించింది. Read: సీఎం జగన్ కు 15 ఏళ్ల బాలిక లేఖ… బ్రాడ్‌గ్రూప్ కంపెనీ చైనాలోని చాంగ్సా ప్రాంతంలో…
కరోనాకు పుట్టినిల్లుగా చెబుతున్న చైనాలోని వూహన్ నగరంలో ఒకే చోట 11 వేల మంది విద్యార్ధులు మాస్క్‌లు లేకుండా గుమిగూడారు. సోషల్ డిస్టెన్స్ లేకుండా పక్కపక్కనే కూర్చున్నారు. వూహాన్‌లోని విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో భాగంగా జరిగిన వేడుకలో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం ప్రపంచంలో ఒకచోట పదిమంది కలిసి కూర్చోవాలంటేనే భయపడిపోతున్నారు. కలిసి తిరగాలంటే ఆంధోళన చెందుతున్నారు. మాస్క్ లేకుండా బయటకు రావడంలేదు. 2019 డిసెంబర్ నెలలో వూహాన్ నగరంలో తొలి కరోనా కేసు నమోదైంది. ఆ తరువాత…
ప్రపంచంలో అమెరికా, రష్యా రెండు బలమైన దేశాలు. ఈ రెండు దేశాల మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు దేశాల మద్య సంబంధాలు పెద్దగా లేవని చెప్పుకొవచ్చు. అయితే, రెండు దేశాల మద్య ఉన్న దూరాన్న తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నడుం బిగించారు. జెనీవాలో జరుగుతున్న నాటో దేశాల శిఖరాగ్రదేశాల సదస్సులో రష్యా అధ్యక్షుడు కూడా పాల్గోన్నారు. అమెరికా, రష్యా దేశాల అధినేతలు భేటీ ఆయ్యారు. రెండు దేశాల మధ్య ఉన్న…
ఇండియా పాక్ దేశాల మధ్య వైరం ఇప్పటిది కాదు. రెండు దేశాలు అణ్వాయుధాలు కలిగిన దేశాలే. రెండు దేశాల మధ్య బోర్డర్లో నిత్యం పెద్ద కాల్పులు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి ముప్పు వస్తుందో అని చెప్పి అణ్వాయుధాలను తయారు చేస్తుంటారు. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ సంస్థ ఏ దేశంలో ఇన్ని అణ్వాయుధాలు ఉన్నాయి అనే అంశంపై వివరణ ఇచ్చింది. ఈ సిప్రి లెక్కల ప్రకారం ఇండియా కంటే పాక్‌లోనే అణ్వాయుధాలు అధికంగా ఉన్నాయని…
కరోనా మహమ్మారి చైనా నుంచి ప్రపంచానికి వ్యాపించిందని వివిధ దేశాలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచ అభివృద్ధి కుదేలైంది. జీ7, నాటో దేశాలు చైనాపై విమర్శలు చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే, చైనా నుంచి ఇప్పుడు మరో విపత్తు ముంచుకొచ్చే అవకాశం ఉన్నది. చైనాలోని దక్షిణ గాంగ్‌డాంగ్ ప్రావిన్స్ లోని తైషాన్ అణువిద్యత్ కేంద్రం నుంచి రేడియోధార్మిక గ్యాస్ లీక్ అవుతుందని, ఇది మరో విపత్తుగా మారే అవకాశం ఉందని అమెరికా…
జీ7 దేశాలకు చైనా పెద్ద వార్నింగ్ ఇచ్చింది. కరోనా వైరస్ చైనా నుంచి వచ్చిందని, ఊహాన్‌లోని ల్యాబ్ నుంచి ఈ మహమ్మారి బయటకు వచ్చిందని అమెరికా గతంలో ఆరోపణలు చేసింది. అప్పట్లో ట్రంప్ చేసిన ఆరోపణలను ప్రపంచం పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు ట్రంప్ చేసిన ఆరోపణలకు బలం చేరూరుతున్నది. ప్రస్తుత అధ్యక్షకుడు జో బైడెన్ కూడా చైనాపై ఉక్కుపాదం మోపేందుకు జీ 7 సదస్సును వేదికగా చేసుకున్నారు. భవిష్యత్తులో చైనా నుంచి ఎదురయ్యే ముప్పును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు…