ప్రపంచాన్ని గడగడలాండించిన కోవిడ్ 19 వైరస్ చైనాలో పుట్టిన సంగతి తెలిసిందే. కాగా, చైనాలో తాజాగా మరో కొత్త వైరస్ కలకలం రేపుతున్నది. కోతుల నుంచి సంక్రమించే మంకీ బీ వైరస్ మానవుల్లో తొలికేసు నమోదయింది. తొలికేసు నమోదైన కొన్ని రోజుల్లోనే ఆ వ్యక్తి మరణించినట్టు చైనా ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతానికి ఒక్కకేసు మాత్రమే నమోదైనట్టు చైనా సీడీసీ ప్రకటించింది. మంకీబీ సోకిన వ్యక్తి నుంచి మరోకరికి ఈ వైరస్ సోకలేదని చైనా చెబుతున్నది. జంతువులపై పరిశోధనలు జరిపే ఓ పశువైద్యుడికి తొలిగా ఈ వైరస్ సోకింది.
Read: ఒక కరెంట్ స్థంబంలో అనేక ఫీచర్లు… ఇండియాలో మొదటి స్మార్ట్ పోల్…
ఈ ఏడాది మార్చి నెలలో చనిపోయిన కొతులను పోస్ట్‌మార్టం చేసి పరిశోధనలు చేస్తున్న సమయంలో వాటి నుంచి మంకీబీ వైరస్ ఆ వైద్యుడికి సోకింది. వాంతి, వికారం వంటి లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆ వైద్యుడు మరణించినట్టు చైనా ప్రకటించింది. వైద్యుడు మరణించిన అనంతరం అతని శరీరాన్ని పరీక్షించగా మంకీబీ వైరస్ సోకినట్టు, ఆ వైరస్ కారణంగానే మరణించినట్టు చైనా వైద్యాధికారులు దృవీకరించారు. మంకీబీ వైరస్‌ను మొదట 1932 లో మకాక్స్ అనే కోతిలో కనుగోన్నారు. ఈ వైరస్ సోకితే మరణాల సంఖ్య 70 నుంచి 80 శాతం ఉంటుందని, జాగ్రత్తగా ఉండాలని చైనా పరిశోధకులు చెబుతున్నారు.