డ్రాగన్ కంట్రీ చైనా కొత్త ఎత్తులు వేస్తోంది. సరిహద్దుల్లో కుయుక్తులు పన్నుతోంది. భారత్‌పై పైచేయి సాధించేందుకు టిబెటన్‌లను రంగంలోకి దించుతోంది. మన దగ్గర ఉన్న ఎస్‌ఎఫ్‌ఎఫ్ బలగాల తరహాలోనే టిబెటన్లతో ప్రత్యేక దళాలను సిద్ధం చేస్తోంది. కుయుక్తులు.. దొంగ దెబ్బలు..! చైనాకు ఇవన్నీ వెన్నతో పెట్టిన విద్య..! లద్దాఖ్‌లో ఉద్రిక్తతల తర్వాత డ్రాగన్.. ఇలాంటి వాటికి మరింత పదునుపెట్టింది డ్రాగన్. ఎల్‌ఏసీ ఉద్రిక్తతల సమయంలో భారత ప్రత్యేక దళాలు.. వ్యూహాత్మకంగా కదిలాయి. ఎస్‌ఎఫ్‌ఎఫ్.. ప్రత్యేక సాయుధ బలగాలు.. చైనా ఎత్తులను చిత్తూ చేస్తూ.. పాంగాంగ్ సో సరస్సు దక్షిణ భాగంలోని కీలక పర్వత ప్రాంతాలను చేజిక్కించుకున్నాయి.
read also : 50 వేల ఉద్యోగాల ప్రకటన పెద్ద కుట్ర : విజయశాంతి
దీంతో అప్పటివరకు కయ్యానికి రంకెలు వేసిన చైనా వెనక్కి తగ్గింది. ఈ ఆపరేషన్‌లో కీలక వ్యవహారించాయి ఎస్‌ఎఫ్‌ఎఫ్ బలగాలు. దీంతో ఈ బలగాల వ్యూహాలను చూసిన చైనా.. ఇప్పుడు టిబెటన్ యువకులపై దృష్టి సారించింది. ఎందుకంటే మన ఎస్‌ఎఫ్‌ఎఫ్ దళాల్లో అత్యధికం టిబెటన్‌లే ఉంటారు..! దీంతో ఈ ఏడాది ఆరంభం నుంచి టిబెటన్ యువకులను రిక్రూట్ చేసుకుంటోంది. ప్రత్యేక ఆపరేషన్‌ల కోసం వీరికి శిక్షణ ఇస్తోంది. ఎల్‌ఏసీ వెంట ప్రత్యేక ఆపరేషన్‌ల కోసమే వీరిని రిక్రూట్ చేసుకుంటున్నట్లు కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. వీరి నిజాయితీని తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు.
చైనా భాష నేర్పించడంతో పాటు.. కమ్యూనిస్ట్ పార్టీకి మాత్రమే కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞలు చేయించుకుంటోందని కేంద్ర వర్గాలు చెబుతున్నారు. టిబెటన్ యువకులను నియమించకోవడం వల్ల చైనాకు రెండు ప్రయోజనాలు..! ఒకటి భారత సరిహద్దుల్లో టిబెటన్‌లు ఈజీగా కలిసిపోతారు. స్థానికుల్లాగే మెలుగుతారు. ఇక రెండోది వీరిని ఎల్‌ఏసీ వెంట నియమించడం వల్ల చైనా సైనికులపై ఒత్తిడి తగ్గుతుంది. పైగా భారత్ సరిహద్దు వెంట ఉండే భౌగోళిక పరిస్థితులపై వారికి అవగాహన ఉంటుంది. అందుకే టిబెటన్ యువకుల నియామకంపై డ్రాగన్ దృష్టి సారించినట్లు కేంద్రం అనుమానిస్తోంది. స్పెషల్ ఫంటీయర్ ఫోర్స్… ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ను భారత్ 1962 యుద్ధం తర్వాత సీఐఏతో కలిసి ఏర్పాటు చేసింది. వీళ్లు పర్వత ప్రాంతాల్లో స్పెషల్ ఆపరేషన్‌లు నిర్వహిస్తారు. ఇప్పుడు చైనా కొత్త ఎత్తులను కూడా భారత్ నిశితంగా పరిశీలిస్తోంది.