కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. 2019 డిసెంబర్లో చైనాలో మొదటగా ఈ వైరస్ను గుర్తించారు. ఆ తరువాత ఈ వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించింది. అయితే, ఈ వైరస్ మూలాలను ఇప్పటి వరకు గుర్తించలేదు. కరోనా వైరస్ మూలాలపై తనకు మూడు నెలల్లో నివేదక అందజేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యూఎస్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీని ఆదేశించారు. చైనాలో మొదట కనిపించిన ఈ వైరస్ జంతువుల నుంచి వచ్చిందా లేదంటే ప్రయోగశాలలో ప్రమాదం…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ చైనాలోని యువాన్ ప్రావిన్స్ లో ఉన్న గుహలు కారణం అని ప్రపంచం భావిస్తోంది. ఆ గుహల నుంచి వైరస్ ఊహాన్కు అక్కడి నుంచి ప్రపంచానికి విస్తరించినట్టు అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం యునాన్లో ఉన్న గుహలను పూర్తిస్థాయి భద్రత కల్పించిది చైనా. ఎవరిని అటువైపు వెళ్లనివ్వడంలేదు. చైనా అద్యక్షుడి అనుమతి ఉన్న పరిశోధకులకు మాత్రమే అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఉంది. ఇక చైనా పరిశోధకులు…
అరుణ గ్రహం పై అడుగిడిన రెండో దేశం చైనా. తియాన్ వెన్ 1 అనే వ్యోమనౌకను గతేడాది చైనా ప్రయోగించింది. ఈ నౌక ఇటీవలే అరుణగ్రహంలోని ఉటోపియా ప్లానిషియా అనే ప్రాంతంలో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఉపగ్రహంలో ఉన్న ఝురాంగ్ రోవర్ శనివారం రోజున ల్యాండర్ నుంచి కిందకు దిగింది. మార్స్ మీద అడుగుపెట్టిన ఆరు చక్రాలతో కూడిన రోవర్ ఫోటోను భూమి మీదకు పంపించి. హైరెజల్యూషన్ 3డి కెమెరాల సహాయంతో ఫోటోలను తీసింది. ఈ రోవర్ గంటకు 200 మీటర్ల మేర ప్రయాణం చేస్తున్నది. …
భూకంపం వచ్చినపుడు భవనాలు ఊగిపోతుంటాయి. నేలమట్టం అవుతుంటాయి. ఆకాశాన్ని తాకే భవనాల్లో ఉండే ప్రజలు భూకంపం వచ్చినపుడు బయటకు పరుగులు తీస్తుంటారు. భూకంపం నుంచి తట్టుకునే విధంగానే పెద్ద పెద్ద భవనాలను నిర్మిస్తుంటారు. అయితే, చైనాలోని షెన్ జెన్ నగరంలో ఉన్న 72 అంతస్తుల సెగ్ ప్లాజా భవనం ఉన్నట్టుండి ఊగిపోయింది. భూకంపం వచ్చిన సమయంలో ఎలాగైతే భవనాలు ఊగిపోతాయో అలా ఊగిపోయింది. దీంతో ఆ భవనంలో పనిచేస్తున్న ఉద్యోగులను హుటాహుటిన బయటకు పంపించారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భవనం ఊగిపోవడంతో మొత్తం ఉద్యోగులను…
చైనా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నది. ఇందులో భాగంగానే అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన విడిభాగాలను తీసుకొని లాంగ్ మార్చ్ 5 బీ అనే ఇటీవలే ఆకాశంలోకి దూసుకుపోయింది. అంతరిక్ష కేంద్రంలోని కొర్ మాడ్యులోకి విజయవంతంగా ప్రవేశించిన తరువాత ఈ రాకెట్ నియంత్రణ కోల్పోయింది. అప్పటి నుంచి ప్రపంచదేశాల్లో టెన్షన్ మొదలైంది. భూమిపై ఏ ప్రాంతంలో ఈ రాకెట్ కూలిపోతుందో అని భయపడ్డారు. ఈరోజు ఉదయం ఈ రాకెట్ భూవాతావరణంలోకి ప్రవేశించిన తరువాత మండిపోయింది. దాని శకలాలు జనావాసాలపై కాకుండా…
దేశంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇండియాలో కొనసాగుతోంది. అయితే, వ్యాక్సిన్ కోసం అనేకమంది భారతీయులు నేపాల్ బాటపడుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు, అనేకమంది భారతీయులు చైనాతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న సంగతి తెలిసిందే. చైనాలో ఉద్యోగాలు చేస్తున్నారు. అలానే చైనాలోని వివిధ విశ్వవిద్యాలయాలలో చదువుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారు . ఎవరైనా సరే చైనాలో అడుగుపెట్టాలి అంటే చైనా వ్యాక్సిన్…
ప్రపంచదేశాల్లో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. కరోనా ఆసుపత్రుల్లో రోగులకు వైద్యం అందించేందుకు, సేవలు చేసేందుకు కావాల్సిన వైద్యులు, నర్సుల కొరత ప్రపంచదేశాల్లో అధికంగా ఉన్నది. అయితే, ఏ దేశానికీ ఆ దేశం ఇప్పుడు ఈ కొరత లేకుండా చూసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యంగా బ్రిటన్, జర్మనీ దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. అక్కడి ఆసుపత్రులకు కరోనా రోగుల తాకిడి అధికంగా ఉన్నది. దీంతో వివిధ దేశాల నుంచి నర్సులను రిక్రూట్ చేసుకోవడానికి ఆయా దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో ఫిలిప్పీన్స్…