చైనా మరో కొత్త ఆవిష్కరణకు తెరలేపింది. గంటకు 600 కిమీ వేగంతో దూసుకుపోయో అత్యాధునిక మాగ్లెవ్ రైలును ఆవిష్కరించింది. తూర్పు చైనాలోని షిడాంగ్ ప్రావిన్స్ కిండాన్ నగరంలో ఈ సరికొత్త మాగ్లెవ్ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చారు. మాగ్లెవ్ ప్రాజెక్టును 2016లో ప్రారంభించగా, మూడేళ్ల కాలంలో అయస్కాంత-వాయుస్తంభన ప్రోటోటైప్ రైలును 2019 లో ఆవిష్కరించారు. పది భోగీలతో కూడిన ఈ రైలులో ఒక్కోభోగీలో 100 మంది చోప్పున ప్రయాణం చేసే వీలుంటుంది. మాములు చక్రాల మాదిరిగా కాకుండా ఈ రైళ్లు ప్రయాణం సమయంలో పట్టాలను తాకకుండా ప్రయాణం చేస్తాయి. దీంతో అత్యంత వేగం సాధ్యం అవుతుంది. అంతేకాదు, రైళ్లు ప్రయాణం చేసే సమయంలో పెద్దగా శబ్దం కూడా రాదని అధికారులు చెబుతున్నారు.
Read: ‘మా’ కాంట్రవర్సీ : జైలుకెళ్ళాల్సిన వాళ్ళు… విష్ణు సంచలన ఆరోపణలు