Chicken Legs: ప్రపంచంలో చూసేందుకు చాలా వింత ప్రదేశాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టు వింతైన ప్రజలు ఉన్నారు. వింత వింత పోటీలు ఉన్నాయి. ఈ మధ్య సోషల్ మీడియాలో తరచూ తిండి తినే పోటీలను చూస్తూనే ఉన్నాం.
Fraud in mutton, chicken, fish weight: తూకాలలో మోసాలు.. అడ్డూ అదుపు లేకుండా కల్తీ వ్యాపారాలు. తూకంలో జరిగినన్ని మోసాలు మరెందులోనూ జరగవంటే అతిశయోక్తి కాదు. పాల నుంచి పప్పు వరకు, కిరోసిన్ నుంచి కూరగాయల వరకు అన్నీ తప్పుడు తూకాలే. అంతేకాదు చిల్లర కొట్టు బండి నుంచి బడా మాల్స్ వరకు ఇదే పరిస్థితి. ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్‌లో చేతివాటం.. బంగారం తూచే మిషన్లు ఇలా అన్నింట్లోనూ మోసాలే. అయితే.. కొంతమంది వ్యాపారులు ఏండ్ల…
సిద్దిపేట జిల్లాలో ఘోరం జరిగింది. జిల్లా లోని ఇస్లామియా మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల నిర్వహకుల నిర్లక్ష్యం విద్యార్థినుల ప్రాణాల మీదకు తెచ్చింది. పలు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో.. ఆసుపత్రి పాలయ్యారు. నిన్న (ఆదివారం) మధ్యాహ్నం విద్యార్థులకు చికెన్ తో భోజనం వడ్డించారు. అయితే మిగిలిన చికెన్ గ్రేవీని వంకాయ కూరలో కలిపి రాత్రి విద్యార్థులకు వడ్డించారు. ఏదో ఒకటి వడ్డించేస్తే ఈరోజు రాత్రికి పని అయిపోతుందిలే అనుకున్న పాఠశాల యాజమాన్యానికి దిమ్మతిరిగింది. విద్యార్థులకు అర్థరాత్రి…
ఒకప్పుడు బర్డ్ ఫ్లూ పేరు చెప్పగానే జనం హడలిపోయారు. దేశంలో చికెక్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. దేశంలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. బీహార్ లో వరుసగా పక్షులు చనిపోవడం అధికారులను ఆందోళనకు గురి చేస్తుంటే.. వ్యాపారులు మాత్రం టెన్షన్ పడుతున్నారు. దీంతో బీహార్ లో చికెన్ తినకుండా చూడాలని జిల్లా అధికారులు ప్రజలను ఆదేశించారు. మళ్లీ తమకు గడ్డురోజులు వచ్చినట్టేనని వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. గత కొన్నాళ్ళుగా బీహార్‌లోని సుపాల్ జిల్లాలో వరుసగా పక్షులు…
కొంత కాలంగా మన దేశంలో ఆహార అలవాట్లను కూడా రాజకీయం చేస్తున్నారు. ఇటీవల ముగిసిన నవరాత్రి సందర్బంలోనూ దానిని చూశాం. పర్వదినాలలో దేశ వ్యాప్తంగా మాంసం దుకాణాలు మూసివేయాలని, హోటళ్లు, రెస్టారెంట్లలో మాంసాహారం అందుబాటులో ఉంచరాదని పలు హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఐతే, ప్రగతిశీల వాదులు దానిని కౌంటర్ చేస్తున్నారు. మాంసాహారం పట్ల వ్యతిరేకత ఎక్కువగా ఉత్తర, మధ్య భారత్‌లో కనిపిస్తుంది. అక్కడ ఈ అంశాన్ని ఒక సమస్యగా చూపించే ప్రయత్నం జరుగుతోంది.…
కరోనా మహమ్మారి తగ్గడంతో శుభకార్యాలు, పెళ్ళి తంతులు పెరిగిపోయాయి. ఓ పెళ్ళి తంతుకి వెళ్లి భోజనం చేసిన 1200 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుజరాత్ లోని మెహసనా జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పెళ్ళి విందులో ఆహారం తీసుకున్న తర్వాత వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడ్డారు జనం. విషయం తెలుసుకున్న అధికారులు ఆహార నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. కాంగ్రెస్ నేత కుమారుడి పెళ్లిలో విందు భోజనం చేసిన 1200 మందికిపైగా అతిథులు ఆసుపత్రి పాలయ్యారు.…
తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలంలో దారుణం చోటుచేసుకుంది. అన్నను చూసేందుకు తెలంగాణ నుంచి ఏపీ వచ్చిన ఓ చెల్లెలు దారుణ హత్యకు గురైంది. కూనవరం సీఐ గజేంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కూనవరం మండలంలోని కన్నాపురం గ్రామానికి చెందిన కొవ్వాసి నంద చెల్లెలు సోమమ్మ (20) తెలంగాణలోని కరకగూడెం మండలం మాదన్నగూడెంలో తన అక్క దగ్గర నివసిస్తోంది. ఇటీవల అన్నను చూసేందుకు కన్నాపురం గ్రామానికి వచ్చింది. అయితే కొవ్వాసి నంద భార్య రెండు రోజుల క్రితం పుట్టింటికి…
కొన్ని ప్రాంతాల్లో మనుషులే కాదు.. ఏదైనా జంతువు, పక్షులు తిరిగినా అనుమానించే పరిస్థితులు ఉంటాయి.. ఇలాంటి వింత పరిస్థితి ఓ కోడికి ఎదురైంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది అగ్రరాజ్యం అమెరికా.. ఆ కోడి తిరిగిన ప్రదేశం.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ హెడ్‌క్వార్టర్స్.. అదే ఆ కోడి చేసిన పాపం అయ్యింది.. వెంటనే రంగంలోని దిగిన పోలీసులు.. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆ కోడిని పట్టుకుని.. స్టేషన్‌లో పెట్టారు.. ఆ తర్వాత క్షుణ్ణంగా ఆ కోడికి పరీక్షలు నిర్వహించారు.…
సంక్రాంతికి నగరం నుంచి వేలాది మంది సొంతూళ్లకు వెళ్లారు. నగరంలో మూడు రోజులపాటు ట్రాఫిక్ రద్దీ చాలా తగ్గిపోయింది. అయితే, సగం నగరం ఖాళీ అయినప్పటికీ సంక్రాంతి వేడుకలు నగరంలో ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి పండగకు రికార్డ్ స్థాయిలో చికెన్ సేల్స్ జరిగింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల వ్యవధిలో రికార్డ్ స్థాయిలో 60 లక్షల కిలోల చికెన్ సేల్స్ జరగింది. సాధారణంగా గ్రేటర్ పరిధిలో రోజుకు 10 లక్షల కిలోల చికెన్…