సిద్దిపేట జిల్లాలో ఘోరం జరిగింది. జిల్లా లోని ఇస్లామియా మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల నిర్వహకుల నిర్లక్ష్యం విద్యార్థినుల ప్రాణాల మీదకు తెచ్చింది. పలు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో.. ఆసుపత్రి పాలయ్యారు. నిన్న (ఆదివారం) మధ్యాహ్నం విద్యార్థులకు చికెన్ తో భోజనం వడ్డించారు. అయితే మిగిలిన చికెన్ గ్రేవీని వంకాయ కూరలో కలిపి రాత్రి విద్యార్థులకు వడ్డించారు. ఏదో ఒకటి వడ్డించేస్తే ఈరోజు రాత్రికి పని అయిపోతుందిలే అనుకున్న పాఠశాల యాజమాన్యానికి దిమ్మతిరిగింది. విద్యార్థులకు అర్థరాత్రి నుంచే వాలికలు అస్వస్థతకు గురై.. వాంతులు, విరేచనాలు చేకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
అయినా యాజమాన్యం నిమ్మకు నీరత్తకుండా వుండిపోయింది. దీంతో బాలికలకు సోమవారం నాటికి కడుపు నొప్పి తీవ్రం మైంది. దీంతో పాఠశాల సిబ్బంది వైద్యులను పిలిపించి స్కూల్ లోనే పిల్లలకు వైద్యం అందించారు. ఈవిషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పిల్లలకు వైద్యం అందించినా సోమవారం మధ్నాహ్నం నుంచి పిల్లలు వాంతులు, విరేచనాలతో బాధపడుతుండటంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇంత జరిగినా ఎటువంటి సమాచారం అందించకుండా రహస్యంగా వైద్యం అందించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే.. ఈ ఘటనపై మంత్రి హరీష్ రావు స్పందించారు. అస్వస్తతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారి కాశీనాథ్ ని , పిల్లలు పూర్తిస్థాయిలో కోలుకునే వరకు డాక్టర్లు పర్యవేక్షణ చేయాలని మంత్రి హరీష్ ఆదేశించారు. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని , విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదని, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని మంత్రి హరీశ్ రావు ధైర్యం చెప్పారు.