కొన్ని ప్రాంతాల్లో మనుషులే కాదు.. ఏదైనా జంతువు, పక్షులు తిరిగినా అనుమానించే పరిస్థితులు ఉంటాయి.. ఇలాంటి వింత పరిస్థితి ఓ కోడికి ఎదురైంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది అగ్రరాజ్యం అమెరికా.. ఆ కోడి తిరిగిన ప్రదేశం.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ హెడ్‌క్వార్టర్స్.. అదే ఆ కోడి చేసిన పాపం అయ్యింది.. వెంటనే రంగంలోని దిగిన పోలీసులు.. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆ కోడిని పట్టుకుని.. స్టేషన్‌లో పెట్టారు.. ఆ తర్వాత క్షుణ్ణంగా ఆ కోడికి పరీక్షలు నిర్వహించారు.
Read Also: ట్రాఫిక్‌కు, విడాకులకు లింక్.. మాజీ సీఎం భార్య వింత వాదన..!
అమెరికాలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ హెడ్‌క్వార్టర్స్ సమీపంలో కోడి అనుమానాస్పదంగా తిరగడాన్ని గమనించారు అధికారులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు.. కోడిని వెంటాడి పట్టుకున్నారు.. దానిపై అనుమానం ఉండడంతో.. దానికి క్షుణ్ణంగా పరీక్షలు చేశారు. ఆ కోడికి ఎక్కడి నుంచి వచ్చింది.. ఇక్కడే ఎందుకు తిరుగుతోంది..? దాని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా? ఉగ్రవాదులు ట్రైనింగ్ ఇచ్చారా? ఇలా.. అనేక కోణాల్లో ఆరా తీస్తున్నారు పోలీసులు.. అయితే, కోడిని అరెస్ట్ చేసిన విషయాన్ని వర్జీనియాలోని ఆర్లింగ్టన్‌కు చెందిన జంతు సంక్షేమ సంఘం సోషల్ మీడియాతో షేర్ చేయడంతో.. ఈ విషయం వెలుగుచూసింది.. భద్రతా తనిఖీ కేంద్రం వద్ద ఓ కోడి అనుమానంగా తిరుగుతోందని.. దానిని తీసుకెళ్లేందుకు తమ అధికారులను పిలిచారని ఓ ఉద్యోగి తన ఎఫ్‌బీ ఖాతాలో పేర్కొన్నాడు.. గోధుమ రంగు ఈకలు కలిగిన ఈ కోడి పేరు హెన్నీ పెన్నీ.. ఆ కోడి వర్జీనియాలో ఓరైతుకు చెందిన కోళ్ల ఫామ్ నుంచి వచ్చినట్లుగా తెలుస్తోందన్న ఆయన.. రైతుకు ఈ కోడి అంటే చాలా ఇష్టమని.. అందుకే దానికి హెన్నీ పెన్నీ అని పేరు పెట్టుకున్నాడంటూ వివరించారు. మొత్తంగా కోడి అరెస్ట్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. కాగా, వివిధ రక్షాల పక్షులను, చిన్న ప్రాణులను సైతం.. ఉగ్రవాదులు కొన్ని ఆపరేషన్లకు ఉపయోగించినట్టు కొన్ని సందర్భాల్లో బయటపడిన విషయం తెలిసిందే.