మంగ్లీ బర్త్ డే పార్టీ వ్యవహారంలో బిగ్ బాస్ దివి కూడా ఇరుక్కుంది. పోలీసులకు ఆమె సహకరించకుండా దురుసుగా ప్రవర్తించినట్టు పోలీసులు వెల్లడించడంతో ఆమె మీద మీడియా ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలో ఆమె ఒక వాయిస్ నోట్ రిలీజ్ చేసింది. Also Read:Mangli Party Issue : పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన దివి మీడియా మిత్రులకు చిన్న రిక్వెస్ట్ , ఇప్పుడు ఫ్రెండ్ బర్త్ డే పార్టీ అని వెళితే మనం అక్కడ ఏం జరిగితే…
మంగ్లీ బర్త్ డే పార్టీ వివాదంగా మారింది. స్నేహితులు, బంధువుల మధ్య ఉల్లాసంగా జరుపుకోవాలనుకున్న బర్త్ డే పార్టీ పోలీస్ స్టేషన్ కు చేరింది. ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించడం, లిక్కర్ సరఫరా చేయడం, గంజాయి తాగిన వ్యక్తి పట్టుబడటంతో కేసు నమోదు వరకు వెళ్ళింది. సరిగా బర్త్ డే రోజే చేవెళ్ల పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ పై కేసు నమోదు అయింది. త్రిపుర రిసార్ట్స్ లో విపరీతమైన సౌండ్ పొల్యూషన్ తో పార్టీ…
Konda Vishweshwar Reddy: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అనేది అసాధ్యమైనది.. చేవెళ్ళకు ఒక చుక్క నీరు రాదు అని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కేవలం మాయమాటలు కాంగ్రెస్ చెప్పింది.. కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ ను రద్దు చేస్తారు అనుకుంటే.. అంబేద్కర్ పేరు తీసి కాళేశ్వరం అని పేరు పెట్టారు.. కాంగ్రెస్ ప్రభుత్వ డిజైన్ బాగానే ఉంది.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు చేదు అనుభవం తగిలింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంపై నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో.. గో బ్యాక్ ఎమ్మెల్యే కాలే యాదయ్య అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే యాదయ్య కాంగ్రెస్ లో చేరడాన్ని నిరసిస్తూ వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరాహార దీక్ష చేపట్టారు.
ప్రభుత్వ ఉద్యోగులు సైతం భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నారని చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ (బుధవారం) ఉదయం ఆయన మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల ప్రచారంలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి దూసుకుపోతున్నారు. ఆయనతో పాటు తన సతీమణి సీతారెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటూ.. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రజలను కోరుతున్నారు. ఈ సందర్భంగా ఓ సభలో భావోద్వేగమైన ప్రసంగం చేశారు. రంజిత్ రెడ్డిని ఎందుకు మళ్ళీ గెలిపించాలో చెప్పారు. ప్రజాసేవకు ఆయన ఎంత పరితపిస్తారో.. తాను చూశానంటూ వెల్లడించారు. మంచి చేసిన నేతను మళ్ళీ భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.
చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ప్రతి అర్హుడికి ఆరు గ్యారంటీలకు తీసుకువచ్చేందుకు తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జి. రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. తన ప్రాంతంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందేదాకా తాను నిద్రపోనని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం శివరాంపల్లి, బండ్లగుడ జాగీర్, మణికొండలో ఎంపీ రంజిత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నియోజకవర్గ ఇంఛార్జి కస్తూరి నరేందర్ తదితర నాయకులతో ఆయన ప్రచారం చేశారు.
రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో డ్రైవర్లను విస్మరించిందని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్‌లోని వైఎన్ఆర్ గార్డెన్స్‌లో భారతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆటో డ్రైవర్లు, లైట్ వెయిట్ మోటార్ వెహికల్ డ్రైవర్లతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కోసం ప్రతి నెల జీవన భృతి కల్పిస్తామని చెప్పి మాట తప్పిందని…