సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ భారతీయ జనతా పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామానికి చెందిన సుమారు వంద మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
దేశంలో కుల, మతాలు, ప్రాంతీయ బేధాలకు అతీతంగా ప్రజలంతా నరేంద్ర మోడీకీ, భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నారని అన్నారు చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు బస్సు సౌకర్యం ఫ్రీగా కల్పిస్తే.. కేంద్రంలోని మోడీ సర్కారు బాధలు ఫ్రీగా కల్పిస్తుందని అన్నారు.
బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గత ఐదేండ్లు తిరిగింది చేవెళ్ళలోని ఊర్లు కాదని.. టూర్లు అని కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి. రంజిత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కరోనా లాంటి విపత్తు యావత్ ప్రపంచాన్ని, చేవెళ్ళ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తే.. ఆయన ఇంట్లో పడుకొని ఎన్నికలప్పుడు మాత్రం బయటకు వచ్చి హడావుడి చేస్తున్నారని ఆగ్రహించారు.
రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. బీజేపీ శ్రేణులతో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో అనేకచోట్ల కొందరు నటులు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్ లో తెలంగాణ రాష్ట్రంలో కూడా మరో తెలుగు నటి లోక్ సభ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. తెలుగులో విడుదలైన పొలిమేర సిరీస్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి దాసరి సాహితి నేడు నామినేషన్ దాఖలు చేసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుండి సాహితి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ…
చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా గడ్డం రంజిత్‌రెడ్డి ఈరోజు (మంగళవారం) నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి కలెక్టర్ శశాంకకు ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. శుభప్రదమైన ఆంజనేయ స్వామి జయంతి రోజున.. తాను తన మొదటి సెట్ నామినేషన్ వేయడం ఆ భగవంతుడి దివ్యమైన ఆశీస్సులుగా భావిస్తున్నట్లు రంజిత్ రెడ్డి తెలిపారు. నామినేషన్ ర్యాలీలో తాండూరు ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డి.. చేవెళ్ళ, రాజేంద్రనగర్ ఇంఛార్జీలు భీం భరత్, కస్తూరి నరేందర్, కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు…
శోభా యాత్రలతో భారతదేశంలో సంస్కృతీ, సాంప్రదాయాలు పెంపొందడంతో పాటూ దేశ భక్తి కూడా పెరుగుతుందని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.