మంగ్లీ బర్త్ డే పార్టీ వివాదంగా మారింది. స్నేహితులు, బంధువుల మధ్య ఉల్లాసంగా జరుపుకోవాలనుకున్న బర్త్ డే పార్టీ పోలీస్ స్టేషన్ కు చేరింది. ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించడం, లిక్కర్ సరఫరా చేయడం, గంజాయి తాగిన వ్యక్తి పట్టుబడటంతో కేసు నమోదు వరకు వెళ్ళింది. సరిగా బర్త్ డే రోజే చేవెళ్ల పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ పై కేసు నమోదు అయింది. త్రిపుర రిసార్ట్స్ లో విపరీతమైన సౌండ్ పొల్యూషన్ తో పార్టీ నిర్వహించిన మంగ్లీ ,పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్ కు లిక్కర్ సరఫరా చేయించింది.
Also Read:Mangli: ఎంతటి ప్రముఖులైనా వదలం.. మంగ్లీ ఇష్యూపై పోలీసుల సీరియస్ వార్నింగ్!
ఇక స్థానికుల సమాచారంతో రిసార్ట్ పై దాడి చేసిన చేవెళ్ల, ఎస్ఓటీ పోలీసులు పార్టీకి అటెండ్ అయిన ఓ వ్యక్తికి గంజాయి పాజిటివ్ నిర్ధారించారు. రైడ్ చేసే సమయంలో రిసార్ట్ లో మంగ్లీ కి చెందిన 50 మంది సన్నిహితులు ఉండగా 48 మందికి డ్రగ్స్ టెస్ట్ చేశారు పోలీసులు. ఇక టెస్ట్ సమయంలో పోలీసులను ముప్పు తిప్పలు పెట్టారు కొందరు పార్టీలో పాల్గొన్న వారు. డ్రగ్ పరీక్షల సమయంలో పోలీసులతో రాష్ గా బిహేవ్ చేసింది మంగ్లీ స్నేహితురాలు దివి.
Also Read:Singer Mangli: వీడియో ఆపుతావా.. లేదా? మంగ్లీ ఓవర్ యాక్షన్!
ఆమె బిగ్ బాస్ కారణంగా ఫేమస్ అయి ఇప్పుడు పలు సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో మంగ్లీ, శివరామకృష్ణ, దామోదర్ రెడ్డి, మెగావత్ కు 41a నోటీసులు జారీ చేశారు. అంతేకాదు మంగ్లీ తీరుపై పోలీసుల సీరియస్ అయి సోషల్ మీడియా ద్వారా కౌంటర్ ఇచ్చారు పోలీసులు. చట్టాలు పాటించకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే సహించేది లేదని, డ్రగ్స్ వాడకంలో ఎంతటి ప్రముఖులు ఉన్న వదిలేది లేదని సైబరాబాద్ పోలీసులు పేర్కొన్నారు.