మంగ్లీ బర్త్ డే పార్టీ వ్యవహారంలో బిగ్ బాస్ దివి కూడా ఇరుక్కుంది. పోలీసులకు ఆమె సహకరించకుండా దురుసుగా ప్రవర్తించినట్టు పోలీసులు వెల్లడించడంతో ఆమె మీద మీడియా ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలో ఆమె ఒక వాయిస్ నోట్ రిలీజ్ చేసింది.
Also Read:Mangli Party Issue : పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన దివి
మీడియా మిత్రులకు చిన్న రిక్వెస్ట్ , ఇప్పుడు ఫ్రెండ్ బర్త్ డే పార్టీ అని వెళితే మనం అక్కడ ఏం జరిగితే ఆ తప్పులు అన్నీ మన మీద తోయడం కాదు కదండీ. మీరు కూడా ఒకసారి చుడండి. చూసి దాన్ని బట్టి నిజంగా ఏమైనా ప్రూఫ్స్ ఉంటే నేను ఏదైనా మిస్టేక్ చేసానని ప్రూవ్ అయితే నా ఫోటో వేస్తే బాగుంటుంది.
Also Read:Mangli: ఎంతటి ప్రముఖులైనా వదలం.. మంగ్లీ ఇష్యూపై పోలీసుల సీరియస్ వార్నింగ్!
కానీ ఎలాంటి ప్రూఫ్ లు లేకుండా మీరు నా ఫోటో యూజ్ చేస్తే ఇలా నెగటివ్ గా చేస్తే నా కెరీర్ కి ఎంత ఇబ్బంది. నేను ఎంతో కష్టోపడి ఈస్థాయికి అచ్చాను. ఎవరైనా ఫ్రెండ్ అంటే పార్టీకి పిలిస్తే వెళ్లాను. ఆమె మంచిదే కదా, అందుకే వెళ్లాను. నేను బర్త్ డే పార్టీకి వెళితే అక్కడ తప్పులు నామీద వేయడం ఎంతవరకు కరెక్ట్? దయచేసి నా ఫోటోలు వాడకండి, నాకు ఇబ్బంది అవుతుంది అని దివి చెప్పుకొచ్చింది.