తమిళనాడులోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో పాములు కలకలం సృష్టించాయి. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణీకుడి వద్ద 5 విషపూరితమైన పాములను కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
తమిళనాడులోని చెన్నైలో ఇద్దరు యువతులు ప్రేమించుకోవడమే కాకుండా సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కుటుంబసభ్యులే బ్రాహ్మణ సంప్రదాయ పద్ధతిలో వారి వివాహాన్ని ఘనంగా జరిపించడం గమనార్హం.
ఓ మందుబాబు చేసిన తుంటరి పనికి దుబాయ్ వెళ్లాల్సిన విమానం ఆగింది. ఆగిపోవడమే కాకుండా ఎయిర్‌పోర్టు సిబ్బంది, పోలీసులను కూడా ఉరుకులు పరుగులు పెట్టించాడు. ఇంతకీ అతను చేసిన పని ఏంటంటే.. శనివారం నాడు తన కుటుంబ సభ్యులను దేశం నుండి బయటకు వెళ్లకుండా అడ్డుకోవాలనుకున్న ఓ తాగుబోతు.. దుబాయ్‌కి వెళ్లే ఓ ప్రైవేట్ క్యారియర్‌కు బూటకపు బాంబు బెదిరింపు చేసి పోలీసుల వలలో పడ్డాడు.
టాలీవుడ్లో తెలుగు ముద్దగుమ్మలకు కొదవ లేదు. అయితే అందులోనూ అంజలి గురించి పరిచయం తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమెల్లె చెట్టు సినిమాతో తెలుగు తనం ఉట్టిపడేలా పరికినీతో అందరి దృష్టి ఆకట్టుకున్న ఈ ముద్దగుమ్మ. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటించిన ప్రతి పాత్రలోనూ ప్రాణం పోసినట్లుగా నటించేస్తుంది. తెలుగులోనే కాదు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా నటించి మంచి పేరును తన సొంతం చేసుకుంది. తెలుగు తనం…
Kakani Govardhan Reddy: తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ ఆగడాలు మితిమీరుతున్నాయి. లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాల వల్ల పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఈ అంశంపై స్పందించారు. లోన్ యాప్ ఆగడాలు ఎక్కువ అవుతున్నాయని.. వీటిపై వెంటనే స్పందించి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. లోన్ యాప్ నిర్వాహకుల గ్యాంగ్‌ను పోలీసులు వలపన్ని పట్టుకున్నారని తెలిపారు. ఆ గ్యాంగ్…
44వ ఫిడే చెస్ ఒలింపియాడ్ జూలై 28న చెన్నైలోని మహాబలిపురంలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా చెన్నై నగరంలోని నేపియర్ బ్రిడ్జ్‌కి చెస్ బోర్డులా పేయింట్ వేశారు. ఈ బ్రిడ్జ్ ప్రయాణికులను అత్యద్భుతంగా ఆకట్టుకుంటోంది. వందేళ్ల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో తొలిసారిగా భారత్ ఆతిథ్యమివ్వనుంది. చెస్ బోర్డులా పెయింట్ వేయబడిన ఈ వంతెన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ ఏడాది రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసా (ఎఫ్1) అప్లకేషన్లు అందనున్నాయని అమెరికా కాన్సులేట్ కార్యాలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం జనవరి నుంచి మే 14 నాటికే 14,694 స్టూడెంట్ వీసాలను జారీ చేసినట్లు వెల్లడించాయి. ఈ సంఖ్య కరోనా ముందు నాటి పరిస్థితులతో పోల్చితే దాదాపు ట్రిపుల్ కావటం విశేషం. 2019లో తొలి ఐదు నెలల్లో 5,663 వీసాల దరఖాస్తులే ఆమోదం పొందాయి. ఈ ఇయర్లో ఇంకా ఏడు నెలల సమయం…
అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు ముదిరింది. పార్టీ అధినేత పదవి కోసం మాజీ ముఖ్యమంత్రులు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య విబేధాలు రచ్చకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగిల్ లీడర్షిప్ ప్రతిపాదనపై ఈరోజు అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి ముందే చెన్నైలో పన్నీర్, పళని వర్గాల నేతలు రోడ్డుపైనే కొట్టుకున్నారు. అంతేకాకుండా చెన్నైలోని అన్నా డీఎంకే ఆఫీసులోకి చొరబడి తలుపులు బద్దలు కొట్టారు. జయలలిత కట్టించిన ఈ ఆఫీస్‌లో ఈరోజు పన్నీర్ సెల్వం, పళనిస్వామి…