Girls Marriage: బంగ్లాదేశ్ అమ్మాయితో తమిళనాడు యువతి వివాహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Girls Marriage: తమిళనాడులోని చెన్నైలో ఇద్దరు యువతులు ప్రేమించుకోవడమే కాకుండా సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కుటుంబసభ్యులే బ్రాహ్మణ సంప్రదాయ పద్ధతిలో వారి వివాహాన్ని ఘనంగా జరిపించడం గమనార్హం. ఇద్దరు యువతులు తమ తండ్రులు ఒడిలో కూర్చుని మరి పూలదండలు మార్చుకున్నారు. బుధవారం చెన్నైలో ఈ ఇద్దరు అమ్మాయిల ‘సాంప్రదాయ’ వివాహం జరిగింది. ఆ తరువాత వారిద్దరు ఒకరి చేతిలో మరొకరు చేయి వేసి నడిచారు. వీరిద్దరూ భార్యాభార్యాలుగా జీవితాన్ని ప్రారంభించారు. పెళ్లి చేసుకున్న యువతుల్లో ఒకరు తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుభిక్ష సుబ్రమణి కాగా.. మరొకరు బంగ్లాదేశ్‌కు చెందిన యువతి టీనా దాస్. వీరిద్దరు గత ఆరేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు తెలిసింది.
తమ ఇళ్లలో పెద్దలను ఒప్పించడానికి ఇంతకాలం పట్టిందని సుభిక్ష వెల్లడించింది. తమ వివాహానికి కుటుంబసభ్యులు ఒప్పుకుంటారని కలలో కూడా ఊహించలేదని ఆమె తెలిపింది. ఎంతో ఆనందంగా ఉందని ఆమె హర్షం వ్యక్తం చేసింది. బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో తమ పెళ్లి జరగడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. చార్టెట్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న సుబిక్ష.. తాను బైసెక్సువల్ అని నిర్మొహమాటంగా చెప్పింది. 19 ఏళ్ల వయసులోనే తన ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. సుభిక్ష తల్లిదండ్రులు కెనడాలోని కల్గేరీలో స్థిరపడ్డారు. సుభిక్ష భార్య టీనా దాస్ బంగ్లాదేశ్‌లోని కన్జర్వేటివ్ హిందూ కుటుంబానికి చెందినవారు. ఈమె కూడా కల్గేరీలోనే నివసిస్తున్నారు.
Also Read
Sonali Phogat: సోనాలీ ఫోగాట్ నివాసంలో 3 డైరీలు స్వాధీనం.. వాటిలో ఏముంది?
సుభిక్ష తల్లి పూర్ణపుష్కల కల్గేరీలో ప్లే స్కూల్‌ను నడుపుతున్నారు. తాను మధురైలో పెరిగానని, తర్వాత ఖతార్‌లో కొన్నాళ్లు నివసించినట్లు ఆమె వెల్లడించారు. కెనడా వెళ్లిన తర్వాతే తమకు ఎల్‌జీబీటీ కమ్యూనిటీ గురించి తెలిసిందని వివరించారు. ప్రేమ విషయం తెలిస్తే బంధువులు, స్నేహితులు తమను ఎక్కడ దూరం పెడతారో అని భయం వేసిందని సుభిక్ష వెల్లడించారు. ఎల్‌జీబీటీ కమ్యూనిటీ గురించి తెలియక తల్లిందడ్రులు తనను అర్థం చేసుకోలేకపోయారని సుభిక్ష భార్య టీనా దాస్ వెల్లడించారు. తనకు ఏదో వ్యాధి ఉందనుకున్నారని పేర్కొన్నారు. పెళ్లయితే అన్నీ సర్ధుకుంటాయని భావించి 19 ఏళ్ల వయసులో తనకు ఓ వ్యక్తితో పెళ్లి చేశారని వెల్లడించారు. ఆ తర్వాత నాలుగేళ్లకు విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. సుభిక్షను కల్గేరీలోనే కలిసినట్లు వివరించారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!