తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన విజయవాడ ఎపిడ్రిన్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. నిషేధిత ఎపిడ్రిన్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న అరుణాచలం ను ముందుగా కస్టడీకి తీసుకోనున్నారు బెజవాడ పోలీసులు. డ్రగ్స్ కేసులో చెన్నై పోలీసులతో సంయుక్తంగా నిందితులను పట్టుకునేందుకు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అరుణాచలం ఇచ్చిన సమాచారం ఆధారంగా డ్రగ్స్ కేసులో కీలకంగా ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారని తెలుస్తోంది.…
అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా… ఏదో విధంగా విదేశాాల నుంచి అక్రమ బంగారం దేశానికి చేరుతూనే ఉంది. అక్రమ బంగార రవాణాలకు ఎయిర్ పోర్టులు వేదిక అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఇండియాలోని పలు విమానాశ్రయాల్లో వరసగా బంగారం పట్టుబడుతోంది. తాజాగా కర్ణాటక బెంగళూర్, తమిళనాడు చెన్నై, ట్రిచి ఎయిర్ పోర్టుల్లో అక్రమ బంగారం పట్టుబడింది. బెంగళూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు అధికారులు. దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికుల వద్ద రూ. 1.44 కోట్ల విలువ…
బంగారం మెరిసింది. వెండి వెలవెలబోయింది. మంగళవారం మార్కెట్లలో బంగారం, వెండి ధరలు అస్థిరంగా నమోదయ్యాయి. మార్కెట్లలో బంగారం ధర పెరగగా.. వెండి ధర తగ్గింది. హైదరాబాద్, విజయవాడ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు ఇదే ట్రెండ్ నమోదైంది. చెన్నైలో మాత్రం బంగారం, వెండి రెండు ధరలూ తగ్గి అక్కడి కొనుగోలుదారులకు శుభవార్తగా నిలిచాయి. పెరుగుతోన్న బాండ్ ఈల్డ్స్.. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలపై ఒత్తిళ్లకు దారితీస్తుందని విశ్లేషకులంటున్నారు. అంతర్జాతీయంగా నమోదవుతోన్న ధరల ప్రభావం కూడా దేశీయంగా…
పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు ఎలక్ట్రికల్ బైకుల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇటీవల వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోతూ ప్రజలకు చికాకు తెప్పిస్తున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఓ వ్యక్తి ఆగ్రహంతో ఎలక్ట్రిక్ బైకుపై పెట్రోల్ పోసి కాల్చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తిరుపత్తూర్ జిల్లా అంబూరుకు చెందిన ఓ వాహనదారుడు చాలా కాలం కిందట ఓలా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు…
ఆదివారం నాడు చెన్నై నగరంలో అనూహ్య ప్రమాదం చోటుచేసుకుంది. ఓ రైలు.. పట్టాలు తప్పి ఏకంగా మీటరు ఎత్తున్న ప్లాట్‌ఫారంపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ప్లాట్ఫారం ధ్వంసమైంది. వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని బీచ్ స్టేషన్లో సబర్బన్ రైలు పట్టాలు తప్పింది. షెడ్ నుంచి స్టేషన్‌కు వస్తున్న సమయంలో ఈ ఘటన సంభవించింది. అయితే ఈ రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. చెన్నై వర్క్‌షాప్ నుంచి కోస్టల్ రైల్వేస్టేషన్ వైపు…
డ్రగ్స్.. రెండు తెలుగు రాష్ట్రాలే కాదు.. యావత్ భారతాన్ని వణికిస్తున్న మహాజాడ్యం. దేశంలో ఎక్కడో చోట డ్రగ్స్, గంజాయి, మత్తుపదార్దాలు పట్టుబడుతున్నాయి. చెన్నై మహానగరంలో డ్రగ్స్ చాక్లెట్స్ కలకలం రేపాయి. నగరంలోని వివిధ స్కూల్స్ , కాలేజీల సమీపంలో డ్రగ్స్ చాక్లెట్స్ విక్రయిస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదులపై అధికారులు తీవ్రంగా స్పందించారు. వెంటనే రంగంలోకి దిగి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విభ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. పాఠశాల విద్యార్ధులు, కాలేజీ స్టూడెంట్స్ యువత టార్గెట్…
తమిళ నటుడు భాగ్యరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలతో మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. ఓ పుస్తకావిష్కరణల్లో భాగంగా బీజేపీ మనిషిని కాదంటూనే మోడీని విమర్శించే వాళ్ళు నెల తక్కువ వాళ్ళు అంటూ కామెంట్స్ చేయడం వివాదానికి దారి తీసింది. దీంతో తాజాగా సారీ చెబుతూ తన వ్యాఖ్యలకు మళ్ళీ వివరణ ఇచ్చుకున్నారు భాగ్యరాజ్. Read Also : Akshay Kumar : పాన్ మసాలా యాడ్ సెగ… సారీ చెప్పి తప్పుకున్న హీరో చెన్నైలోని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో…
కరోనా మహమ్మారి తర్వాత పెళ్ళిళ్ళు బాగా పెరిగాయి. అయితే ఈ పెళ్ళి వేడుకల్లో విచిత్రమయిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఉల్లిధరలు పెరిగినప్పుడు ఉల్లి దండలు బహుమతులుగా ఇచ్చేవారు. కొత్తగా పెళ్లయినవారికి ఉల్లిపాయలు పెట్టి గిఫ్ట్ బాక్సులు అందించేవారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్.. ధరలంటే జనాలు భయపడిపోతున్నారు. రోజుకి ఇంచుమించుగా రూపాయి పెంచుతూ చమురు సంస్థలు వినియోగదారులను ఎడాపెడా బాధేస్తున్నాయి. https://ntvtelugu.com/viman-restaurant-viral-in-vijayawada/ ఓ వివాహ వేడుకలో నూతన వధూవరులకు వారి స్నేహితులు ఇచ్చిన గిఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్…
భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా మహోత్సవ్’ పేరుతో వివిధ రంగాలలో పలు కార్యక్రమాలు జరుపుతున్నారు. అందులో భాగంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సౌత్ రీజన్) సైతం ఓ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. చెన్నై ట్రేడ్ సెంటర్ లో ఏప్రిల్ 9, 10 తేదీలలో సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్ ను జరుపుతోంది. ఈ శిఖరాగ్ర సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు కార్లు అచ్చివచ్చినట్టుగా కన్పించడం లేదు. తాజాగా ఆయన కారుపై చలాన్ ఉండడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. 648 పట్టణ స్థానిక సంస్థలు, 12,607 వార్డు సభ్యులకు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండగా, అందులో విజయ్ అభిమానులు కూడా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఓటు వేయడానికి తలపతి విజయ్ చెన్నైలోని ఓ పోలింగ్ బూత్‌కు వెళ్లారు. అయితే విజయ్ అక్కడికి వెళ్లడం…