Madras High Court’s Unique Punishment in Drunk And Drive: మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తికి వినూత్న శిక్ష విధించింది మద్రాస్ హైకోర్టు. మద్యం మత్తులో కారు నడుపుతూ.. ముగ్గురు పాదచారులు గాయపడటానికి కారణం అయ్యాడు ఓ వ్యక్తి. అయితే ఆ వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ సరికొత్త రీతిలో శిక్ష విధించారు జస్టిస్ ఏడీ జగదీష్ చంద్రం. మద్యం తాగి వాహనం నడపకూడదని, మద్యానికి వ్యతిరేకంగా చెన్నైలోని సిటీ జంక్షన్ల వద్ద కరపత్రాలు పంపిణీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సైదాపేటలోని 4వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఇద్దరు పూచికత్తుతో పాటు రూ. 25వేల బాండ్ సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అప్పుడే నిందితుడు జైలు నుంచి బయటకు విడుదల అవుతారని న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. ఆగస్టు 23న ఓ వ్యక్తి అతివేగంగా, అజాగ్రత్తగా వాహనం నడుపుతూ.. ముగ్గురిని ఢికొట్టాడు. ఈ కేసులో నిందితుడికి బెయిల్ మంజూరును ప్రాసిక్యూషన్ వ్యతిరేకించారు. ముగ్గురిని గాయపరచడమే కాకుండా.. అక్కడ నుంచి పారిపోయారని వాదించారు.
Read Also: New Feature in Whatsapp: వాట్సాప్ లో ఈ ఫీచర్.. ఎంత ఉపయోగమో తెలుసా?
అయితే సంఘటన పరిణామాలు, సదరు వ్యక్తి కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉండటంతో పాటు.. గాయపడిన ముగ్గురు వ్యక్తులు కూడా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో న్యాయమూర్తి డ్రంక్ అండ్ డ్రైవ్ కు పాల్పడిన వ్యక్తికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. నిందితుడు ప్రతీ రోజు అడయార్ పోలీస్ స్టేషన్ వచ్చి.. ఉదయం 9-10 గంటల నుంచి సాయంత్రం 5-7 గంటల వరకు కరపత్రాలు పంపిణీ చేయాలని.. అవసరమైనప్పుడు పోలీసులు ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.