ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మిగనూరు పంచాయతీ సద్దుమణిగిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి రచ్చకెక్కింది. ఇంతకుముందు ఎమ్మిగనూరు ఇంచార్జిగా మాచాని వెంకటేశ్వర్లను ప్రకటించిన వైసీపీ అధిష్టానం.. అతన్ని తప్పించబోతున్నారు. అయితే వైసీపీ క్యాడర్ లో వ్యతిరేకత రావడంతో మరోసారి మాచాని పై సర్వే చేయించింది అధిష్టానం. కాగా.. సర్వేలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో అధిష్టానం బుట్టా రేణుకను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి అంగీకారంతో బుట్టా రేణుక నియామకం జరుగనుంది. ఈ…
అయోధ్యలోని రామమందిరంలో కొలువుదీరిన బాలరాముడు ఇకపై 'బాలక్ రామ్' గా దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. మందిరంలో కొలువుదీరిన రామ్ లల్లా ఐదేళ్ల పసిబాలుడిగా దర్శనమిస్తున్నారు. అందుకే బాలక్ రామ్ పేరును నిర్ణయించినట్లు చెప్పారు. అంతేకాకుండా.. ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్ గా పిలుస్తామని తెలిపారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జుల మార్పు కసరత్తుపై చర్చలు కొనసాగుతున్నాయి. సీఎంవో పిలుపుతో పలువురు నేతలు తాడేపల్లికి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో.. నందికొట్కూరు నియోజకవర్గ ఇంఛార్జి మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. నందికొట్కూరు నియోజకవర్గ ప్రస్తుత ఇంఛార్జి బైరెడ్డి సిద్దార్థ రెడ్డికి సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఇంఛార్జి మార్పుపై కసరత్తు చేస్తుంది అధిష్టానం. మరోవైపు.. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను బైరెడ్డి కలిశారు. నందికొట్కూరు…
పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తాను ఇప్పుడుంటున్న జైల్లో ఉండలేనని.. తనను వేరే జైలుకు మార్చేలా చూడాలని తన తరపు న్యాయవాదులకు చెప్పినట్టు పాక్ మీడియా వెల్లడించింది.
రోడ్డుపై వెళుతున్న ఆటో టైర్‌ను మార్చగల ప్రతిభావంతుడైన వ్యక్తిని మీరు ఎప్పుడూ చూసి ఉండరు. అతను అద్భుతమైన ప్రతిభావంతుడు, అటువంటి ప్రతిభావంతుడైన వ్యక్తి యొక్క వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. మరోపక్క భయాందోళనలను సృష్టిస్తోంది. ఆటోలో ఉన్న అతను కదులుతున్న టైరును మారుస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటలకు భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎక్స్ కేటగిరీగా ఉన్న ఈటల భద్రతను వై ప్లస్ కేటిరీకి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
నగరాలు, పట్టణాలు, ప్రాంతాల పేర్లను మార్చడం ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఇపుడు మహారాష్ట్రకు పాకింది. రెండు, మూడు రోజుల క్రితం వెర్సోవాబాంద్రా సీలింక్ కు సావర్కర్ సేతుగా నామకరణం చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
జులై మొదటి వారంలో కేంద్రమంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జూలై 17 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే కేంద్రమంత్రివర్గంలో మార్పులు జరుగనున్నాయి. అయితే ఈసారి జరిగే మంత్రివర్గ కూర్పులో తెలంగాణ నుంచి ఒకరికి అవకాశం ఉంది..!.
విపక్షాల రెండో సమావేశం బెంగళూరులో వచ్చే నెల 13వ తేదీ, 14వ తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు శరద్ పవార్ తెలిపారు. బెంగుళూరులో విపక్షాల భేటీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించనున్నట్లు పేర్కొన్నారు. అయితే కొందరు నేతలను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పవార్ వెల్లడించారు. వచ్చే నెల మధ్యలో వర్షాలు ఉధృతంగా కురుస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో షిమ్లాలో సమావేశ నిర్వహణ సరైన నిర్ణయం కాకపోవచ్చనే అభిప్రాయానికి ప్రతిపక్షాలు వచ్చాయి. వాతావరణ…
కొడుకు పెళ్లి కోసం ఓ తండ్రి తన కులం నుంచి మరొక కులానికి మారాడు. ఈఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగపూర్ జిల్లా కరేలిలో చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవాలన్న తపనతో.. తన ప్రేమను పొందేందుకు ఓ యువకుడు ముస్లిం నుంచి హిందువుగా మారాడు.