MahaRastra: ఇత్వారీ రైల్వే స్టేషన్ పేరు మార్పు.. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MahaRastra: నగరాలు, పట్టణాలు, ప్రాంతాల పేర్లను మార్చడం ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఇపుడు మహారాష్ట్రకు పాకింది. రెండు, మూడు రోజుల క్రితం వెర్సోవాబాంద్రా సీలింక్ కు సావర్కర్ సేతుగా నామకరణం చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ముంబై ట్రాన్స్‌హార్బర్ లింక్‌కు మాజీ ప్రధాని వాజ్‌పాయ్ స్మృతి నవసేన అటల్ సేతు అని పేరు ఖరారు చేసింది. ఇప్పుడు ఇత్వారీ రైల్వే స్టేషన్ పేరు మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Read also:
Monsoon Food Tips: వర్షాకాలంలో ఈ ఫుడ్ అస్సలు తీసుకొవద్దు.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం!
Also Read
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా ఇత్వారీ రైల్వే స్టేషన్ పేరును నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇత్వారీ రైల్వే స్టేషన్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బాటలో ప్రయాణిస్తున్నారు. సీఎం యోగి లాగానే.. షిండే కూడా నగరాలు, వంతెనల పేర్లు మార్చే పనిలో పడ్డారు. ఇప్పటికే మహారాష్ట్ర సర్కార్ పలు నగరాల, వంతెనల పేర్లు మార్చింది. తాజాగా రైల్వేస్టేషన్ పేరును మార్చుతున్నట్టు షిండే సర్కార్ ప్రకటన చేసింది. నాగ్ పూర్ జిల్లాలోని ఇత్వారీ రైల్వే స్టేషన్ పేరును ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇత్వారీ’ స్టేషన్ గా మార్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే కృష్ణ ఖోప్డే సమాచారం ఇచ్చారు.
Read also: Devara : ‘దేవర’ పార్ట్ 1 కంప్లీటే కాలేదు అప్పుడే పార్ట్ 2?
బిజెపి ఎమ్మెల్యే కృష్ణ ఖోప్డే మీడియాతో మాట్లాడుతూ.. నాగ్ పూర్ జిల్లాలోని ఇత్వారీ రైల్వే స్టేషన్ పేరును నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇత్వారీ స్టేషన్ గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. ఇందుకు సంబంధించి మే 23న హోం మంత్రిత్వ శాఖ నుంచి పేరు మార్పునకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అందించిందనీ.. అలాగే.. జూన్ 16న రాష్ట్ర హోం శాఖ నోటిఫికేషన్ జారీ చేసిందని నాగ్‌పూర్ తూర్పు తెలిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళులు అర్పించడంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు. మహారాష్ట్ర సర్కార్ ఇప్పటికే ఔరంగాబాద్ పేరును ఛత్రపతి శంభాజీ నగర్ గా, ఉస్మానాబాద్ నగరానికి ధరాశివ్ గా, అహ్మద్‌నగర్ ను అహల్యాదేవి హోల్కర్‌గా పేరు మార్చిన విషయం తెలిసిందే. అలాగే.. మూడు రోజుల క్రితం వెర్సోవాబాంద్రా సీలింక్ కు వీడీ సావర్కర్ సేతుగా నామకరణం చేసింది. దాంతోపాటు ముంబై ట్రాన్స్‌హార్బర్ లింక్‌కు మాజీ ప్రధాని వాజ్‌పాయ్ స్మృతి నవసేన అటల్ సేతు అని పేరు ఖరారు చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!