వైసీపీ, కాంగ్రెస్, టీడీపీకి మేం చెప్పేది ఒక్కటే.. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ కావాలని చంద్రబాబు అడిగారు.. తప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు, నాయకులు చేసి బీజేపీపై విమర్శలు చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.
చంద్రబాబు ఇచ్చే దరఖాస్తును అమ్మవారి ఎదుట ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు బుద్దా వెంకన్న.. ఇక, ర్యాలీ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. టికెట్ రాలేదని ఎవరైనా చంద్రబాబుని విమర్శించినా తాట తీస్తానని హెచ్చరించారు. చంద్రబాబు నాకు దైవ సమానులు. చంద్రబాబుకిచ్చే అప్లికేషన్ ముందుగా కనకదుర్గమ్మకు ఇచ్చాను. విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి ఎంపీగా నాకు అవకాశం ఇవ్వాలని అప్లికేషన్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు
చంద్రబాబు పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఆంబోతు వ్యాఖ్యలకు అంబటి పచ్చబొట్టు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు తనను ఆంబోతు రాంబాబు అంటున్నాడు.. అధికారికంలోకి వస్తే తనకు ముక్కుతాడు వేస్తాడట.. అధికారికంలో వచ్చేది లేదు, చచ్చేది లేదుని దుయ్యబట్టారు. ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు చేతి పై పచ్చబొట్టు వేయిస్తానని అన్నారు. ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే రాజకీయ నాయకుడు…
ఒంగోలు తెలుగుదేశానికి ఎంతకీ కొరుకుడుపడని కొయ్యగా తయారైంది. ఆ జిల్లాలో బలంగా ఉన్నామని చెప్పుకుంటున్న పార్లమెంట్ సీటుతో పాటు, మరో అసెంబ్లీ సెగ్మెంట్ కు కూడా ఇంచార్జ్ దొరకడం లేదు. అభ్యర్థుల కసరత్తు, రాజకీయ వ్యూహాలు ఎన్ని ఉన్నా.. ఆ పార్టీకి అక్కడ పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి దొరకడం లేదని టాక్.. చివరినిమిషంలో సీటు దక్కగా వచ్చే వలస నేతల కోసమే ఆ పార్టీ ఎదురుచూస్తోందని అధికార పార్టీ విమర్శిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో జనసేన-టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.. ఆ దిశగా మనమంతా కృషి చేయాలి అని పిలుపునిచ్చారు పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ బోడే ప్రసాద్.. నియోజకవర్గంలో నిర్వహించిన టీడీపీ - జనసేన ఉమ్మడి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించిన కష్టపడి పనిచేయాలి.. ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరిచేసుకోవాలి.. ముందుకు సాగాలి అన్నారు.