త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పొత్తులపై చంద్రబాబుతో మంతనాలు జరపనున్నారు బీజేపీ ఢిల్లీ పెద్దలు. ఈ నెల 8వ తేదీన చంద్రబాబు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందంటున్నారు.. ఎనిమిదో తేదీన భేటీ కావాలని చంద్రబాబు - పవన్ కల్యాణ్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.. ఇక, చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్కళ్యాణ్లపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని ఫైర్ అయ్యారు. జగన్ జనంలోకి వెళుతుంటే టీడీపీ, జనసేన షేక్ అవుతున్నాయని ఆయన అన్నారు. 2014లో ఉమ్మడి పోటీగా ఇచ్చిన హామీల్లో ఒకటైనా నెరవేర్చారా అంటూ ప్రశ్నించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దించడమంటే చంద్రబాబును అధికారంలోకి తేవటమా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు అధికారం కోసం కాపులు.. పవన్ కల్యాణ్ వెంట నడవడం లేదన్న ఆయన.. దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 40 నుండి 60 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని సూచించారు.
ఇచ్చిన హామీలు అమలు చేయదని టీడీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని ఆయన తెలిపారు. చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు మేనిఫెస్టో లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఒకేరోజు రెండుసార్లు భేటీకావడం, సుదీర్ఘంగా చర్చలు జరపడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీట్ల సర్దుబాటుపై ఫైనల్ చర్చల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం దాదాపు మూడు గంటలపాటు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ సమావేశమయ్యారు.
కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మరోసారి రానున్నారు. సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు. అయితే.. ఎంపీ బాలశౌరి పార్టీలో చేరుతున్న సందర్భంలో పవన్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అని కాదు.. ఎంతని కాదు.. 98 శాతం స్ట్రైక్ రేట్ ఉండాలంటూ తెలిపారు. పొత్తుల్లో భాగంగా జరిగే సీట్ల సర్దుబాటు వల్ల కొందరికి బాధ కలిగించవచ్చని పవన్ వ్యాఖ్యానించారు.
నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నేరం జరిగిన తీరు పట్ల మంత్రి కాకాణికి అవగాహన లేదని, ఫైళ్ల మిస్సింగ్ కేసులో ఆయన పాత్ర లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, సోమిరెడ్డిపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తాను మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రెండు రోజుల్లోనే నెల్లూరు కోర్టులో బ్యాగు చోరీకి గురైందని తెలిపారు.…
పద్మ అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం సత్కారం.. ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సన్మానించింది. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర మంత్రులు హాజరయ్యారు. పద్మ అవార్డు గ్రహీతలను సత్కరించిన ముఖ్యమంత్రి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 లక్షల నగదును అందజేశారు. రెండు తెలుగు…