చంద్రబాబు పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఆంబోతు వ్యాఖ్యలకు అంబటి పచ్చబొట్టు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు తనను ఆంబోతు రాంబాబు అంటున్నాడు.. అధికారికంలోకి వస్తే తనకు ముక్కుతాడు వేస్తాడట.. అధికారికంలో వచ్చేది లేదు, చచ్చేది లేదుని దుయ్యబట్టారు. ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు చేతి పై పచ్చబొట్టు వేయిస్తానని అన్నారు. ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే రాజకీయ నాయకుడు…
ఒంగోలు తెలుగుదేశానికి ఎంతకీ కొరుకుడుపడని కొయ్యగా తయారైంది. ఆ జిల్లాలో బలంగా ఉన్నామని చెప్పుకుంటున్న పార్లమెంట్ సీటుతో పాటు, మరో అసెంబ్లీ సెగ్మెంట్ కు కూడా ఇంచార్జ్ దొరకడం లేదు. అభ్యర్థుల కసరత్తు, రాజకీయ వ్యూహాలు ఎన్ని ఉన్నా.. ఆ పార్టీకి అక్కడ పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి దొరకడం లేదని టాక్.. చివరినిమిషంలో సీటు దక్కగా వచ్చే వలస నేతల కోసమే ఆ పార్టీ ఎదురుచూస్తోందని అధికార పార్టీ విమర్శిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన-టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.. ఆ దిశగా మనమంతా కృషి చేయాలి అని పిలుపునిచ్చారు పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ బోడే ప్రసాద్.. నియోజకవర్గంలో నిర్వహించిన టీడీపీ - జనసేన ఉమ్మడి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించిన కష్టపడి పనిచేయాలి.. ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరిచేసుకోవాలి.. ముందుకు సాగాలి అన్నారు.
ఏపీలో సైకో పాలన కొనసాగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. రాజమండ్రిలో నిర్వహించిన 'రా కదలిరా' సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తిలో ఆడపిల్లకు సమాన వాట ఇవ్వాలని ఎన్టీఆర్ పని చేస్తే, చట్టాలు చేస్తే.. ఈ రోజు వైఎస్ బిడ్డకు సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి సీఏం జగన్ ది అని దుయ్యబట్టారు. ఆడపిల్లల పై దాడులు చేస్తున్న ఆంబోతులకు హెచ్చరిక చేస్తున్నా.. ఆడబిడ్డల…
విశాఖలో వైసీపీ 'సిద్ధం' సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభ నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించింది. కాగా.. సభకు హాజరైన సీఎం జగన్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే.. ఆ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఫొటోలు పెట్టి కొందరు కార్యకర్తలు ఆ ఫొటోలపై బాక్సింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి కొట్టారు.
సిరిసిల్ల నేత కార్మికులకు 365 రోజులు పని కల్పించేలా జివో తెస్తాం..! రాజన్న సిరిసిల్ల నేత కార్మికులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్ శుభవార్త చెప్పారు. నేత కార్మికులకు 365 రోజులు పని కల్పించేలా జివో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల పట్టణం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్లను డెవలప్మెంట్ చేయడానికి రేడీగా ఉన్నామన్నారు. బతుకమ్మ చీరలకు ఆర్డర్ ఇవ్వమని మా మంత్రి తుమ్మల ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు.…