రాజకీయాల్లో శాశ్వత శతృత్వం, మిత్రత్వం ఉండదు అన్నారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన... ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా రాష్ట్రానికి మేలు జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.. ఇక, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని తెలిపారు
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. దీంతో, పొత్తులపై ఆయా పార్టీలు చర్చలు ముమ్మరం చేస్తున్నాయి.. ఏపీలో ఇప్పటికే బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఉందని.. రెండు పార్టీల నేతలు చెబుతున్నారు.. మరోవైపు.. టీడీపీ-జనసేన మధ్య కూడా పొత్తు కుదిరింది
త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పొత్తులపై చంద్రబాబుతో మంతనాలు జరపనున్నారు బీజేపీ ఢిల్లీ పెద్దలు. ఈ నెల 8వ తేదీన చంద్రబాబు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందంటున్నారు.. ఎనిమిదో తేదీన భేటీ కావాలని చంద్రబాబు - పవన్ కల్యాణ్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.. ఇక, చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్కళ్యాణ్లపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని ఫైర్ అయ్యారు. జగన్ జనంలోకి వెళుతుంటే టీడీపీ, జనసేన షేక్ అవుతున్నాయని ఆయన అన్నారు. 2014లో ఉమ్మడి పోటీగా ఇచ్చిన హామీల్లో ఒకటైనా నెరవేర్చారా అంటూ ప్రశ్నించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దించడమంటే చంద్రబాబును అధికారంలోకి తేవటమా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు అధికారం కోసం కాపులు.. పవన్ కల్యాణ్ వెంట నడవడం లేదన్న ఆయన.. దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 40 నుండి 60 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని సూచించారు.
ఇచ్చిన హామీలు అమలు చేయదని టీడీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని ఆయన తెలిపారు. చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు మేనిఫెస్టో లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు.