Kesineni Chinni: నాయకులు పోయేవాళ్లు పోతుంటారు.. కానీ, కార్యకర్తలే నాయకులను తయారు చేస్తారు అన్నారు టీడీపీ విజయవాడ పార్లమెంటరీ సమన్వయకర్త కేశినేని చిన్ని.. తిరువూరులో పర్యటించిన ఆయనకు స్థానిక నేతలు స్వాగతం పలికారు.. భారీ ర్యాలీ నిర్వహించారు.. ఆ తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిరువూరు పట్టణం రెండవ వార్డ్ లో ఇతర పార్టీలకు చెందిన 50 కుటుంబాలు కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరారు.. వారికి టీడీపీకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేశినేని చిన్ని.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేసారు. కానీ, కొంతమంది పదవులు అనుభవించి.. మళ్లీ పదవులు రావటం లేదని వేరే పార్టీలోకి వెళ్ళిపోయారని ఫైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ కి ముఖ్యం కార్యకర్తలే ఎందుకంటే పార్టీలో నాయకులు వస్తుంటారు పోతుంటారు కార్యకర్తలే శాశ్వతంగా ఉంటారని తెలిపారు.
Read Also: Prabhas: దిల్ రాజు తమ్ముడి కొడుకు పెళ్లి.. ప్రభాస్ ఇంటికెళ్ళి ఆహ్వానం
ఇక, ఇక్కడ ఒక అభ్యర్థికి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పిస్తే రెండుసార్లు గెలిచారు.. మూడుసార్లు ఓడిపోయారు.. ఆయన సతీమణికి జెడ్పీచైర్మన్ పదవిని కూడా కల్పించారు చంద్రబాబు నాయుడు అని గుర్తుచేశారు. మరోవైపు.. మా కుటుంబంలో కూడా ఒక వ్యక్తి (కేశినేని నాని)కి రెండుసార్లు ఎంపీగా అవకాశం కల్పించారు. వాళ్లు ఇద్దరికీ ఈసారి టికెట్ రాదనే ఉద్దేశంతో స్వార్థం కోసం వైసీపీలో చేరి చంద్రబాబు నాయుడుని విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. నాయకులు పోయేవాళ్లు పోతుంటారు.. కానీ, కార్యకర్తలే నాయకులను తయారు చేస్తారన్న ఆయన.. నిజమైన టీడీపీ కార్యకర్తలు ఎండనకా వానకా.. కేసులకు భయపడకుండా టీడీపీని అంటి పెట్టుకొని ఉన్నారు.. పార్టీ వదిలి వెళ్లిపోయిన నాయకులకు ప్రజాక్షేత్రంలో వారికి శృంగభంగం తప్పదని హెచ్చరించారు. పార్టీ ఇప్పటివరకు ఎవరిని అభ్యర్థులుగా ప్రకటించలేదు .. కానీ, పార్టీ అధిష్టానం నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాలి అని స్పష్టం చేశారు కేశినేని చిన్ని.