తెలంగాణ కెప్టెన్‌గా ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్! వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మరోసారి బ్యాట్ పట్టేందుకు సిద్దమయ్యాడు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (ఐవీపీఎల్)లో గేల్ ఆడనున్నాడు. ఐవీపీఎల్ మొదటి ఎడిషన్‌లో తెలంగాణ టైగర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని గేల్ స్వయంగా చెప్పాడు. వెటరన్ ప్రీమియర్ లీగ్‌తో మీ ముందుకు రాబోతున్నా, ఐవీపీఎల్ కోసం అందరూ సిద్దంగా ఉండండి అని యూనివర్సల్ బాస్ పేర్కొన్నాడు.…
ఏపీ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. ఆయా పార్టీ అధినేతలు ఢిల్లీ పర్యటనలతో ఏపీ రాజకీయాలు హస్తినకు చేరుకున్నట్లైంది. అయితే.. బీజేపీతో చంద్రబాబు చర్చలపై పేర్ని నాని ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన కృష్ణా జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో చంద్రబాబు అర్థరాత్రి చర్చల కారణమేంటి ? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వంతో చర్చలు జరిపితే మంచిదేనని, 2014లో బీజేపీ రాష్ట్రానికి అవసరం అన్నారు చంద్రబాబు అని ఆయన అన్నారు. 2019 వరకు కలిసి ఉండి చివర్లో మోసం చేసిందని…
చిత్తూరు జిల్లా పుంగనూరు లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు పై హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి, మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలో కి వచ్చినప్పుడు 14200 కోట్లు డ్వాక్రా రుణాలు ఉన్నాయి. నేడు వాటికి వడ్డీలకు వడ్డీలు అయ్యి 25 వేల కోట్లకు చేరిందని, సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో చంద్రబాబు ఇచ్చిన హామీలపై స్పందించారని ఆయన అన్నారు.…
చంద్రబాబుపై ఎంపీ నందిగామ సురేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓటమి భయంతో చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని అన్నారు. అనరాని మాటలు అని ఇప్పుడు బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లడుతున్నారని ఆరోపించారు. తాను పనిచేస్తేనే ఓటు వేయాలని జగన్ చెప్తుంటే.. 40 ఏళ్ల అనుభవం ఉండి పొత్తుల కోసం చంద్రబాబు బీజేపీ వెంట పడుతున్నారని విమర్శించారు. 14 ఏళ్లలో ప్రజలకు చేసిన మంచి పని చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని దుయ్యబట్టారు.
అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఐఆర్ఆర్ కేసులో చార్జిషీట్ ను ఇవాళ ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసింది. ఏ1గా చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి నారాయణ పేర్లను పేర్కొంది. కాగా.. నారా లోకేష్ , లింగమనేని రమేష్, రాజశేఖర్ ప్రధాన నిందితులుగా సీఐడీ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. సింగపూర్ తో చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ఒప్పందం చేసుకుందని ఛార్జ్ షీట్ లో దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్…
కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీనుకు ఊరట.. బెయిల్ మంజూరు విశాఖ ఎయిర్ పోర్టులో సీఎం జగన్ పై కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు శ్రీనుకు ఊరట లభించింది. ఏపీ హైకోర్టు అతనికి షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఐదేళ్ల తర్వాత శ్రీనుకు బెయిల్ లభించింది. కాగా.. ఈ కేసుపై మీడియాతో మాట్లాడద్దొని నిందితుడికి న్యాయస్థానం ఆదేశించింది. రూ.25 వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని.. ప్రతి ఆదివారం ముమ్మడివరం పోలీస్ స్టేషన్…