Chandrababu: ఢిల్లీలో చంద్రబాబు.. అర్ధరాత్రి అమిత్‌షాతో భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. నిన్న సాయంత్రం 6.30 గంటలకు హస్తిన చేరుకున్న చంద్రబాబుకు ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికారు ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, రఘురామకృష్ణరాజు.. ఇక, ఆ తర్వాత హోటల్‌కు చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకున్న ఆయన.. ఆ తర్వాత ఎంపీ గల్లా జయదేవ్ ఇంటికి చేరుకున్నారు. అక్కడే పార్టీ ఎంపీలతో సమావేశం అయ్యారు.. ఈ సమయంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా అక్కడి రావడం చర్చగా మారింది.. ఇటీవలే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. టీడీపీలో చేరతారనే ప్రచారం సాగుతోన్న నేపథ్యంలో.. ఆయన చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: Handbag: ఈ బుల్లి హ్యాండ్ బ్యాగ్ ధర ఎన్ని లక్షలో తెలిస్తే అవాక్కవుతారు..
Also Read
- CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
- CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు చంద్రబాబు.. మొదట రాత్రి 7 గంటల తర్వాతే ఈ భేటీ జరుగుతుందనే ప్రచారం జరిగినా.. చివరకు బుధవారం రాత్రి 11.25 గంటల సమయంలో అమిత్‌షా నివాసానికి చేరుకున్నారు చంద్రబాబు.. సుమారు గంటపాటు చర్చలు సాగాయి.. అయితే, ఈ సమావేశం నుంచి 10 నిముషాల ముందుగానే వెళ్లిపోయారు జేపీ నడ్డా… ముఖ్యంగా ఈ భేటీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై చర్చ సాగినట్టుగా తెలుస్తోంది.. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే టీడీపీతో పొత్తు ప్రకటించి ఎన్నికల సిద్ధమైన వేళ.. ఇప్పుడు టీడీపీని కూడా ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడానికి బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబుతో సమావేశమైనట్లు భావిస్తున్నారు. ఇక, త్వరలోనే ఎన్నికల పొత్తులపై ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు.. ఈ రోజు ఉదయమే ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చంద్రబాబు ప్రయాణం కానుండగా.. మరోవైపు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు హస్తినకు వెళ్లనున్నారు.
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!