ప్రజాగళం సభపై వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014లో అప్పుడు టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఏర్పాటు చేసుకున్నారు.. ఇప్పుడు మళ్లీ పదేళ్ల తర్వత అదే నాటకం ప్రారంభించారు అని పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలో ప్రజల్లోకి వెళ్ళనున్నారు. ప్రజా గళం పేరుతో ప్రజల్లోకి విస్తృత పర్యటనలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న సభకు పెట్టిన పేరుతోనే ప్రజల్లోకి టీడీపీ అధినేత వెళ్లనున్నారు.
నిన్న ( ఆదివారం ) ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగలేదని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రశ్నించారు. చిలకలూరిపేటలో జరిగిన టీడీపీ- బీజేపీ- జనసేన ఉమ్మడి సభ ఫ్లాప్ అయిందని ఆరోపించారు.
చిలకలూరిపేటలో ప్రజాగళం పేరుతో నిర్వహించిన సభలో ప్రధాని ఏదైనా వాగ్దానం చేశారా అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకంగా కేంద్రం ఏం న్యాయం చేసిందంటూ ఆయన ప్రశ్నలు గుప్పించారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఏపీకి ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలు ఇచ్చారు.. అంతేకానీ ప్రత్యేకంగా ఏమి ఇచ్చారంటూ ప్రశ్నించారు.
ఆంధ్రా కుటుంబ సభ్యులందరికీ నమస్కారమంటూ ప్రధాని మోడీ తెలుగులో తమ ప్రసంగాన్ని ప్రారంభించారు. నిన్ననే షెడ్యూల్ విడుదలైందని.. ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు రావాలి.. ఎన్డీఏకు ఓటేయాలన్నారు. ఏపీలోని చిలకలూరిపేటలోని బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఫలితాలు జూన్ 4వ తేదీన రాబోతున్నాయని.. ఫలితం కూడా 400కు పైగా ఎంపీ స్థానాలు రాబోతున్నాయన్నారు. దేశ, రాష్ట్ర ప్రగతి కోసం ఎన్డీఏ రావాలన్నారు.
ఏపీలో గెలుపు ఎన్డీయేదేనని ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కన్నారు. కూటమికి మోడీ అండ ఉందన్నారు. మోడీ క్రమశిక్షణను చూసి అందరూ నేర్చుకోవాలన్నారు. మూడు పార్టీల జెండాలు వేరు కానీ, మా అజెండా ఒకటేనన్నారు. ఏపీ కోసం మూడు పార్టీలు జట్టు కట్టాయన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే మా అజెండా అని పేర్కొన్నారు. ఇది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సభ అని ఆయన తెలిపారు. మోడీ అంటే భవిష్యత్, మోడీ అంటే ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసమని…