సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. ఈ రోజు విపక్షాలపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.. పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధమని ప్రకటించిన ఆయన.. జనసేన వేరే పార్టీలో కలవడం కాదు త్వరలోనే క్లోజ్ అయిపోతుందని జోస్యం చెప్పారు.. పిఠాపురంలో వైసీపీకి సునాయాసంగా ఉంటుందన్న ఆయన.. సినిమావాళ్లు అతీతులు కాదు.. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు.. మా ఇంటికొస్తే ఏం తెస్తారు అనే విధంగా సినిమా…
టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు తిక్కారెడ్డి.. చంద్రబాబు మంత్రాలయం టీడీపీ టికెట్ విషయంలో పునరాలోచించాలని సూచించారు. టికెట్ ఇవ్వక పోతే ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమని ప్రకటించారు. ఇక, చంద్రబాబు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి బ్రోకర్లు ఉన్నారు అంటూ ఫైర్ అయ్యారు.. చంద్రబాబు చుట్టూ ఉన్నవారు డబ్బులకు అమ్ముడు పోయి.. వైఎస్ జగన్ కోవర్టులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
విజయవాడలోని పెనమలూరు టీడీపీ సీటు పంచాయితీ సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్కు బుజ్జగింపు చర్యలు మొదలెట్టింది టీడీపీ అధిష్టానం. మాజీ ఎమ్మెల్యే, పెనమలూరు ఇంఛార్జి బోడే ప్రసాద్కు టికెట్ లేదని చెప్పేసింది అధిష్టానం. దీంతో.. నిన్నటి నుంచి బోడే వర్గం ఆందోళనకు దిగింది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబును బోడే ప్రసాద్ కలవనున్నారు. సాయంత్రం నుంచి నియోజక వర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టే దిశగా ప్లాన్ చేస్తున్నారు బోడే ప్రసాద్.. అయితే..…
ఏపీపీఎస్సీలో అక్రమాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తి చేశారు. 2018లో జరిగిన గ్రూప్-1 పరీక్షల వాల్యూయేషన్లో అక్రమాలు జరిగాయని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 వాల్యూయేషన్లో అక్రమాలపై ఆధారాలను చంద్రబాబు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం యువతను దగా చేసిందని ఆరోపించారు. ఏపీపీస్సీలో అక్రమాలు చేసి యువత గొంతు నులిమేశారని, కృూర మృగాల మాదిరి పిల్లల జీవితాలను నాశనం చేశారన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా రాష్ట్రంలో కీలక పోస్టులను భర్తీ చేస్తారని,…