ఉదయగిరి ఆత్మీయ సమావేశంలో ఉదయగిరి తెలుగుదేశం-జనసేన-బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి.. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం తీసుకొస్తానని కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఈ సమావేశం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నుబోయిన చంచల బాబు యాదవ్ ఆధ్వర్యంలో మండల కన్వీనర్ బయన్న అధ్యక్షతన జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం- జనసేన- భారతీయ జనత పార్టీ (ఎన్డీయే) కూటమికి మద్దతు ఇస్తున్నట్లు లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రకటించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. చంద్రబాబు రాజకీయ వికలాంగుడంటూ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఎంపీ కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఇంప్రెస్ చేయడానికి ఆయన నానా పాట్లు పడ్డారు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడికి ఒక్క ముక్క హిందీ రాదు.. తెలుగులో రాసుకొని హిందీలొ చదివాడు అని చెప్పారు.
వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఈ నెల 27వ తేదీ నుంచి ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సుయాత్ర ద్వారా తొలి విడత ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు.
విద్యార్థులకు ఆ సినిమా చూపించండి.. సీఎం రేవంత్ కు బండి సంజయ్ లేఖ రజాకార్ సినిమాకు వినోదపు పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలని, పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఈ సినిమా చూపించాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి ఎంపీ బండి సంజయ్ కుమార్ లేక రాశారు. రజాకార్ల రాక్షస పాలనలో తెలంగాణ ప్రజలు పడ్డ బాధలను కళ్లకు కట్టినట్లు చూపిన సినిమా రజాకార్ అన్నారు. నిజాం పాలన నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించి…