చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ చేరారు. పార్టీ కండువా కప్పి సంజీవ్ కుమార్ ను సాదరంగా చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. పొయ్యిమీద కాలుతున్న కుండను ముట్టుకునే ప్రయత్నం చేస్తే చెయ్యి కాలుతుందన్నారు. నాతో సహా రాష్ట్ర ప్రజలు వైసీపీను ఓసారి ముట్టుకుని ఆ తప్పు చేశారని ఆయన విమర్శించారు. రెండో చెయ్యి కూడా కాల్చుకోవద్దని ప్రజల్ని కోరుతున్నానన్నారు సంజీవ్ కుమార్. కర్నూల్ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు…
ఏపీపీఎస్సీ గ్రూప్-1లో అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పెద్దల హస్తంతోనే పరీక్షలు, నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఐపీఎస్ అధికారులు గౌతమ్ సవాంగ్, సీతారామాంజనేయులపై కేసు నమోదు చేయాలని ఆయన అన్నారు. సర్వీస్ కమిషన్‌ను సీఎం జగన్ వైసీపీ కార్యాలయంగా మార్చి నాశనం చేశాడని చంద్రబాబు మండిపడ్డారు. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, ఏపీపీఎస్సీ పెద్దలు…
పిట్‌బుల్ సహా విదేశీ కుక్క జాతులను నిషేధించాలని కేంద్రం సిఫారసు.. పలు విదేశీ కుక్క జాతులను నిషేధించాలని కేంద్రం సిఫార్సు చేసింది. పెటా ఇండియా అభ్యర్థన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇల్లిగల్ ఫైటింగ్, దాడులకు ఎక్కువగా ఉపయోగించే విదేశీ కుక్క జాతుల అమ్మకం, పెంపకం లేదా వాటిని కలిగి ఉండటంపై నిషేధం విధించాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు బుధవారం లేఖ రాసింది. మానవుకులు ప్రమాదాలను తీసుకువస్తున్న పిట్ బుల్స్ వంటి…
టీడీపీ ఇటీవల 94 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ చంద్రబాబు మాట్లాడుతూ, వీలైనంత మంది టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితాను రేపు ప్రకటిస్తామని వెల్లడించారు. టీడీపీ అభ్యర్థుల జాబితా కసరత్తులు తుది దశకు చేరుకున్నాయని ఆయన వెల్లడించారు.
ఇంటింటికి మంచి నీటి కుళాయిలు అందిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఇవన్నీ మహిళల కోసం ప్రవేశ పెట్టాం.. ఇప్పుడు విద్యార్ధినుల కోసం కలలకు రెక్కలు పేరుతో మరో పథకం ప్రవేశపెట్టాం.. పేద విద్యార్థినులు కలల సాకారం చేసుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి.. విద్యార్ధినుల ఉన్నత చదువుల కోసం బ్యాంక్ లోన్లు తీసుకునేలా మేం సహకరిస్తామన్నారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవాన్ని పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పెనమలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ జోగి రమేష్ తో పాటు రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో కలిసి ప్రారంభించారు.