ప్రజాగళం సభపై వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014లో అప్పుడు టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఏర్పాటు చేసుకున్నారు.. ఇప్పుడు మళ్లీ పదేళ్ల తర్వత అదే నాటకం ప్రారంభించారు అని పేర్కొన్నారు.. ఆ రోజు ఇచ్చిన హామీలు.. ప్రత్యేక హోదాతో సహా తర్వాత ఏమి అయ్యాయి? అని ఆయన ప్రశ్నించారు. 2014లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఏ మాత్రం అమలు చేశారు? అంటూ అడిగారు. మూడేళ్ల తర్వాత విడాకులు తీసుకుని విడిపోయారు.. కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని వ్యక్తిత్వహననం చేశారు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు.
Read Also: Mukesh Khanna: శక్తిమాన్ గా రణవీర్.. ఛీఛీ.. అతను శక్తిమాన్ ఏంటి.. ఒంటిపై బట్టలు లేకుండా..
ఇక, ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు రెండు పార్టీలు ఒకే స్టేజీపైకి వచ్చారు అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 2014లో ఇచ్చిన హామీల విషయంలో చిలకలూరిపేట సభలో మూడు పార్టీలు ప్రజలకు సంజాయిషీ ఇవాల్సింది అని అన్నారు. ప్రజలను మోసగిస్తామనే భావన వాళ్ల ముఖాల్లో కనిపించడం లేదు.. పొత్తులు లేకుండా చంద్రబాబు ఎన్నికలకు రారు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. 2014లో 600 వందల హామీలు ఇచ్చారు చంద్ర బాబు.. హామీల అమలు విషయంలో సంజాయిషీ ఇవ్వాలి మూడు పార్టీలు అని అన్నారు. ఏ మొహం పెట్టుకుని మూడు పార్టీలు ఒకే స్టేజీ మీదకు వచ్చారు అని ప్రశ్నించారు. అబద్ధాలు, వంచనకు ప్రతిరూపం చిలకలురిపేట సభలో మూడు పార్టీల కూటమి అంటూ సజ్జల ఆరోపించారు.
Read Also: MLC Jeevanreddy: కేసీఆర్కు పట్టిన గతే మోడీకి పడుతుంది.. తీవ్ర విమర్శలు
కేవలం సీఎం జగన్ మీద దుమ్మెత్తి పోయడం పనిగా ఈ మూడు పార్టీల నేతలు పెట్టుకున్నారు అని సజ్జల అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఏం చేస్తారో సభలో చెప్పలేకపోయారు.. చిలకలూరిపేటలో కూటమి సభ ఫెయిల్ అయ్యింది.. సభలో వాళ్ల మైక్ సిస్టం ఫెయిల్ అయితే.. పోలీసులకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. పొరపాటున కరెంట్ పోతే.. మాదే తప్పు అనే వాళ్ళు.. ప్రధానికి మోడీకి సన్మానం అంటారు కానీ, శాలువా రాదు.. ఇదేక్కడి విచిత్రం అని ఆయన ఎద్దేవా చేశారు. మోడీ ప్రధాని హోదాలో వస్తే జగన్ ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కును ప్రస్తావించారు.. హోదా అంశంను సభలో ఎందుకు మూడు పార్టీలు ఎందుకు ప్రస్తావించలేదు.. జగన్ మీద రాష్ట్ర ప్రజలకు నమ్మకం బలంగా ఉంది.. విశ్వసనీయతకు వారెంటి అవసరం లేని గ్యారెంటీ జగన్.. చెప్పిన దాని కంటే ఎక్కువ చేశారు జగన్ .. ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Read Also: Ballistic Missiles: మూడు బాలిస్టిక్ మిస్సైళ్లను పరీక్షించిన నార్త్ కొరియా..
జగన్ పాలనలో ప్రజల జీవితాల్లో వెలుగులు వచ్చాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు మోసాలను అప్రమత్తంగా ఉండి ప్రజలు తిప్పికొట్టాలి.. చంద్ర బాబు కూటమి మోసపూరిత పాలన ఒక వైపు.. చెప్పిన దాని కంటే ఎక్కువ చేసిన జగన్ విశ్వసనీయత ఉన్న పాలన మరో వైపు ఉందన్నారు. మరో ఐదేళ్లు ఈ స్కీమ్ లు కొనసాగాలంటే జగన్ పాలన రావాలి.. వైసీపీ- కాంగ్రెస్ పార్టీలు ఒక్కటి అంటే ప్రజలు నమ్మరు అని సజ్జల పేర్కొన్నారు.