డబ్బు, పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు.. గుంటూరు ప్రజలకు సేవ చేసేందుకే వచ్చా.. ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తాం.. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించి లోకేష్ ను, నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలి అని పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు.
ఉదయగిరి ఆత్మీయ సమావేశంలో ఉదయగిరి తెలుగుదేశం-జనసేన-బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి.. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం తీసుకొస్తానని కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఈ సమావేశం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నుబోయిన చంచల బాబు యాదవ్ ఆధ్వర్యంలో మండల కన్వీనర్ బయన్న అధ్యక్షతన జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం- జనసేన- భారతీయ జనత పార్టీ (ఎన్డీయే) కూటమికి మద్దతు ఇస్తున్నట్లు లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రకటించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.