నెల్లూరు లోక్సభ వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో పలువురు జన సేన నేతలు, కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టసభల్లో ఎక్కడా జనసేన పార్టీకి ప్రాతినిధ్యం లేదన్నారు. కేవలం చట్ట సభల్లోకి రావడానికే టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.
మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు..! మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో వనదేవతల దర్షనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో సమక్క సారాలమ్మ ఆలయం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. మహాజాతర ముగిసిపోయి నెల గడిచినా భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఇవాళ గొర్రెల బలి, బంగార(బెల్లం) లతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో మునుగు జిల్లాలో రోడ్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవార్ల దర్శనానికి భక్తులు…
తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 27వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు చేయబోతున్నారు.
బొచ్చు గాళ్ళు వాళ్ళే వారసత్వం చేయాలా? మూడు తరాలుగా రాజకీయాలో ఉన్నాం.. నా కొడుకు ఎందుకు రాకూడదు? అని ప్రశ్నించారు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే లేకుండా ఎవడు పడితే వాడు పార్టీ పెడితే నేను వెళ్ళాలా? అని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించునున్నారు. రెండు రోజుల పాటు నేడు, రేపు విస్తృతంగా పర్యటించనున్నారు. ఇవాళ కుప్పంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం నుంచి టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. కానూరులోని యార్లగడ్డ గ్రాండియర్ లో భారీగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు జరిగాయి. గన్నవరం నియోజకవర్గంలోని ఏడు గ్రామాల నుంచి సుమారు నాలుగు వందల మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి కండువా కప్పి టీడీపీ ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరిన పలువురు నేతలు మాట్లాడుతూ.. యార్లగడ్డ గెలుపుకోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేస్తామని తెలిపారు.