ఏపీలోని గంజాయి మాఫియా మన రాష్ట్ర ప్రజలనే కాదు, పొరుగు రాష్ట్రాల వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్లో తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, జగిత్యాలలో గంజాయి ముఠా అరెస్ట్ సమయంలో వెలుగు చూసిన వాస్తవాలు నివ్వెర పరిచాయని పేర్కొ్న్నారు. గంజాయి విక్రయిస్తున్న ఈ ముఠాకి విశాఖలోని సీలేరు నుంచి గంజాయి సరఫరా కావడం ఎంతో ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. మన రాష్ట్రంలో గంజాయి అమ్మకాల గురించి పొరుగు రాష్ట్ర పోలీసులు చెపుతుంటే ఈ…
గజ్వేల్లో పట్టుబడ్డ నగదు.. రూ.50 లక్షలు సీజ్..! గజ్వేల్ పట్టణంలో పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న డబ్బు పట్టుబడింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో గజ్వేల్లోని అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బచ్చు రత్నాకర్కు చెందిన కారు (టీఎస్36సీ 0198)లో రూ.50 లక్షల నగదును పోలీసులు గుర్తించారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు స్వాధీనం చేసుకోలేదు. ఈ సందర్భంగా గజ్వేల్ సీపీ అనురాధ మాట్లాడుతూ రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లరాదని సూచించారు.…
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో.. ఏలూరు ఎంపీ అభ్యర్థి ప్రకటనతో బీజేపీ, టీడీపీలో ముసలం ఏర్పడింది. టీడీపీ నేత పుట్టా మహేష్ యాదవ్ కు టికెట్ కేటాయించడంపై పార్టీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో.. టీడీపీని వీడేందుకు గోపాల్ యాదవ్ సిద్ధమయ్యారు. ఆయన ఎంపీ టికెట్ ఆశించగా నిరాశ ఎదురైంది.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాగి ఆలయంలో నెల్లూరు వైసీపీ లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్పే అప్పుల లెక్కలు పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఏ రాష్ట్రం కూడా పరిమితికి మించి అప్పు చేయలేదు.. రాష్ట్రాన్ని అప్పుల్లో నింపారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. ప్రజలు…
ఈ ఎన్నికల్లో కొంత మంది నేతలకు సీట్లు ఇవ్వలేకపోవచ్చు.. కానీ, వాళ్లు చేసిన త్యాగాన్ని నేను మరువలేను అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్రం కోసం.. దేశం కోసం జట్టు కట్టాం. సంప్రదాయ రాజకీయాలు ఉండుంటే మనం కూడా ట్రెడిషనల్ పాలిటిక్స్ చేసేవాళ్లమన్న ఆయన.. ఏపీలో వైసీపీ ఓడిపోకుంటే రాష్ట్రం నాశనం అవుతుందని పవన్ కల్యాణ్ భావించారు. ఓటు చీలకూడదని పవన్ సంకల్పం తీసుకున్నారని తెలిపారు.
వైజాగ్ డ్రగ్ కేసులో గుమ్మడి కాయ దొంగ అంటే బుజాలు తడుముకున్నట్టు ఉంది టీడీపీ పరిస్థితి అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ కు ఆరోపణలు చేయడానికి బుద్ధి ఉండాలి కదా? అని దుయ్యబట్టారు. తమ పై విమర్శలు చేస్తున్నారు.. ఆ కంపెనీలు పురంధేశ్వరి దగ్గరి బంధువులది అని అంటున్నారని సజ్జల పేర్కొన్నారు. వైజాగ్ డ్రగ్ కేసులో టీడీపీ నేతల సంబంధం ఉన్నట్టు బలంగా అనిపిస్తుందని తెలిపారు. వైజాగ్ డ్రగ్ కేసులో…