Anantapur Lok Sabha: అనంతపురం పార్లమెంటు స్థానంపై టీడీపీలో సందిగ్ధత నెలకొంది. ఇక్కడ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారన్నదానిపై ఇంకా స్పష్టతరాలేదు. కానీ రోజుకు ఒక పేరు మాత్రం తెరపైకి వస్తోంది. అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్లో బోయ సామాజికవర్గం ఎక్కువ. ఇక్కడ కురుబ సామాజికవర్గం కూడా ఉంది. గతంలో బోయ సామాజికవర్గానికి టికెట్ ఇచ్చి వైసిపి సక్సెస్ అయింది. ఈసారి కురుబ కులానికి చెందిన శంకర్ నారాయణకు టికెట్ ఇచ్చింది. తెలుగుదేశం కూడా అదే ట్రెండ్ ఫాలో కావాలని చూస్తోంది. కానీ కురుబ సామాజికవర్గానికి చెందిన బి.కె పార్థసారథికి హిందూపురం పార్లమెంట్ స్థానం కేటాయించింది. దీంతో అనంతపురం పార్లమెంటు స్థానంలో ఎవరికైనా బీసీకి ఇస్తారా?అనే ప్రచారం జరుగుతోంది.
Read Also: Kurnool TDP: టీడీపీకి తలనొప్పిగా కర్నూలు.. ఐదు నియోజకవర్గాల్లో అదే తీరు..!
ఇప్పటికే బోయ సామాజికవర్గానికి చెందిన కాల్వ శ్రీనివాసులుకు రాయదుర్గం టికెట్ కేటాయించింది. ఇటు గుంతకల్లులో గుమ్మనూరు జయరాంకు దాదాపుగా టికెట్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఒకే పార్లమెంటు సెగ్మెంట్లో రెండు అసెంబ్లీ స్థానాలు బోయలకు ఇచ్చింది. ఇప్పుడు పార్లమెంటు స్థానం బోయలకు కాకుండా బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా జెసి పవన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జెసి పవన్ రెడ్డి ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి ఆయన పేరు కూడా వినిపిస్తోంది. అదే సమయంలో బోయల్ని కూడా పరిశీలిస్తోంది. సామాజికవర్గానికి చెందిన కమ్మూరి నాగరాజు, ప్రొఫెసర్ రాజేష్, మాజీ జడ్పీ ఛైర్‌మన్ పూల నాగరాజు పేరు కూడా తెరపైకి వచ్చింది. వీళ్లంతా బోయ సామాజికవర్గానికి చెందిన నేతలే. వీళ్ల పేరు మీదుగా కూడా సర్వేలు నిర్వహిస్తోంది టీడీపీ.
Read Also: Virat Kohli: ‘ఛీటర్-ఛీటర్’ అంటూ నినాదాలు.. కోహ్లీ హృదయాన్ని ముక్కలు చేసిన భారత ఫాన్స్!
హిందూపురానికి చెందిన అంబికా లక్ష్మీనారాయణ పేరు తెరపైకి వచ్చింది. ఆయన బోయ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. దశాబ్దంన్నర కాలంగా తెలుగుదేశంలో పనిచేస్తున్నారు లక్ష్మీనారాయణ. ఐతే…అభ్యర్థుల ఎంపికలో టీడీపీ తడబాటు కనిపిస్తుండటంతో క్యాడర్లో కన్ఫ్యూజన్ నెలకొంది. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి శంకర్ నారాయణ రెండు నెలలుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్ని నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. తెలుగుదేశంలో మాత్రం ఇలా కన్ఫ్యూజన్‌లోనే ఉంది. ఈనెల 28న టిడిపి అధినేత చంద్రబాబు ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనకు రానున్నారు. ఆయన పర్యటనలోపు టికెట్‌పై స్పష్టత ఇస్తారా? లేదా?అన్నది చూడాలి.