కృష్ణా జిల్లా గుడివాడ ఒకటవ వార్డులో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని.. చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం చంద్రబాబు గాడిది కాళ్లైనా పట్టుకుంటాడంటూ ఎద్దేవా చేశారు. అధికారం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తాడని రాష్ట్రంలోని ముస్లిం, క్రిస్టియన్, హిందూ సోదరులందరికీ తెలుసు.. ఆయన వెనకాల ఉన్న తెలుగు తమ్ముళ్లకు, పదిమంది జనసైనికులకు తప్ప అంటూ విమర్శలు గుప్పించారు.
నాపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపితమే తనపై వచ్చిన భూ ఆక్రమణ ఆరోపణలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొట్టిపారేశారు, తనపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపితమని అన్నారు. తనను అనవసరంగా తప్పుడు కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బీఆర్‌ఎస్ నుంచి మారాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని, అయితే తనకు అలాంటి ఆలోచనే లేదని చెప్పారు. 2023 ఆగస్టులో తనను అక్రమంగా నిర్బంధించి, దాడి చేసి డబ్బులు వసూలు చేశారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు,…
టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో.. ఆయన పొన్నూరు నియోజకవర్గంలో రోడ్ షో, కార్నర్ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ 1983లో ఒక బలమైన భావజాలంతో పుట్టిందని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఆశయంతో పుట్టిందని చెప్పారు. అదే విధమైనటువంటి భావజాలంతో ఈరోజు పుట్టిన పార్టీ జనసేన అని అన్నారు. పవన్ కల్యాణ్…
కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా.. యువతతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా యువత అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు ఇచ్చారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 60 రోజుల్లో మెగా డీఎస్సీ నిర్వహిస్తాం అని చెప్పారు. ఏ రంగంలో కూడా అడ్డదారిలో విజయాలు రావు.. లక్ష్య సాధనకు అనునిత్యం కృషి చేయాలని పేర్కొన్నారు. ద్రవిడ విశ్యవిద్యాలయంలో తొలగించిన కోర్సులను పునరుద్దరిస్తాం.. కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పారు. మద్యానికి…
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి సమిష్టిగా కలిసి పనిచేసి.. విజయం సాధిద్దామని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సురేష్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో కొండాపురం మండల కన్వీనర్ ఓంకారం అధ్యక్షతన మండలం క్లస్టర్ క్లస్టర్ ఇంచార్జ్ చెరుకూరి వెంకటాద్రి నేతృత్వంలో 5 మంది యూనిట్ ఇన్చార్జీలు 47మంది బూత్ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు.
ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. ఐకమత్యంతో అందరం కలిసికట్టుగా పనిచేసి ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా వేగర వేద్దాం అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మనందరి జీవితాలు మారుతాయి అన్నారు.