ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఏర్పడిన నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ టికెట్ కేటాయించలేక ఈ మూడు పార్టీలు అసంతృప్త జ్వాలలను ఎదుర్కొంటున్నాయి. అనంతపురం అర్బన్ టీడీపీలో టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఏర్పడిన నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ టికెట్ కేటాయించలేక ఈ మూడు పార్టీలు అసంతృప్త జ్వాలలను ఎదుర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావుకు కీలక బాధ్యతలు అప్పగించింది టీడీపీ.. దేవినేని ఉమాకు అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలు అప్పచెప్పింది.. ఇప్పటికే ఉన్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాతో పాటు ఉమకు అదనపు బాధ్యతలు అప్పగించినట్టు టీడీపీ ఏపీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం హోదాలో మెగా డీఎస్సీపైనే తొలి సంతకం పెడుతానని ఆయన హామీ ఇచ్చారు. 9 సంవత్సరాల ఐదు నెలలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసే రికార్డు నెలకొల్పానన్నారు.
అనంతపురం జిల్లాలోని రాప్తాడు ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచారం ఓ ఫ్లాప్ షో అని పేర్కొన్నారు. జగన్ ఓ పెద్ద సైకో అయితే.. రాప్తాడులో పిల్ల సైకో ఉన్నాడు.. ఫ్యాన్ కు ఓటేసిన ప్రజలు అదే ఫ్యానుకు ఉరేసుకునే పరిస్థితికి వచ్చారు అని ఆయన ఆరోపించారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పలమనేరు నుండి ప్రజా గళం పేరుతో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. అందులో భాగంగా రేపు ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు పట్టణంలో ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, జిల్లా ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరుతూ.. శంఖారావాన్ని పూరించి రాక్షస పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కంకణ బద్దుడై వస్తున్నారని, ఈ శంఖారావంతో వింజమూరు అదరాలి..…
నగరిలో మీ ఉత్సాహం చూస్తూ ఉంటే రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని అనిపిస్తోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సభలో గాలి భానుప్రకాష్, ఇతర నేతలు పాల్గొన్నారు. నగరి మీటింగ్ చూసిన తర్వాత జగన్ మైండ్ బ్లాక్ అవుతుందన్నారు.